తెలంగాణ

telangana

ETV Bharat / state

పత్రికా ధర్మాన్ని కాపాడిన వ్యక్తి మొహిద్దీన్: సునీల్​రావు - పాత్రికేయుడు సయ్యద్​ మొహిద్దీన్​ మృతి పట్ల మేయర్​ సంతాపం

సియాసత్​ ఉర్దూ పత్రికలో పనిచేసిన పాత్రికేయుడు సయ్యద్​ మొహిద్దీన్​ మరణం పట్ల కరీంనగర్​​ మేయర్​ సునీల్​రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉర్దూభవన్​లో నిర్వహించిన సంతాప సభలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.

journalist syed mohiyuddin condolences meeting in karim
పత్రికా ధర్మాన్ని కాపాడిన పాత్రికేయుడు : సునీల్​రావు

By

Published : Dec 21, 2020, 7:54 PM IST

సియాసత్​ ఉర్దూ పత్రికలో పనిచేసిన పాత్రికేయుడు సయ్యద్​ మొహిద్దీన్ మృతి పట్ల మేయర్​ సునీల్​రావు విచారం వ్యక్తం చేశారు. కరీంనగర్​లోని ఉర్దూభవన్​లో ముస్లి ఇంటలెక్చువల్​ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.

సయ్యద్​ మొహిద్దీన్​ అకాల మరణం పత్రికా రంగానికి తీరని లోటని అన్నారు. నైతిక విలువలను పాటిస్తూ పత్రిక ధర్మాన్ని కాపాడారని అన్నారు. మీడియా రంగంలో నిబద్ధతతో పనిచేసి గుర్తింపు పొందారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు మేయర్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:కరోనా వైరస్ స్ట్రెయిన్​తో రాష్ట్ర వైద్య శాఖ అప్రమత్తం

ABOUT THE AUTHOR

...view details