తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యేగా ఓడి... ఎమ్మెల్సీగా గెలిచారు - KARIMNAGAR-ADILABAD-NIZAMABAD-MEDAK

ఎమ్మెల్యేగా ఓడిపోయినా... ఎమ్మెల్సీగా గెలిచి ప్రతిపక్షాన్ని బతికించారు కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్​రెడ్డి. ప్రత్యర్థి చంద్రశేఖర్​ గౌడ్​పై 39,430 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

ఎమ్మెల్యేగా ఓడి... ఎమ్మెల్సీగా గెలిచాడు

By

Published : Mar 27, 2019, 6:27 AM IST

Updated : Mar 27, 2019, 8:29 AM IST

ఎమ్మెల్యేగా ఓడి... ఎమ్మెల్సీగా గెలిచారు
కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి టి. జీవన్ రెడ్డి విజయం సాధించారు. 56,698 ఓట్లు సాధించి విజయ బావుటా ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థి తెరాసకు చెందిన చంద్రశేఖర్ గౌడ్​పై 39,430 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

17 మంది బరిలో నిలువగా తొలి రౌండ్ నుంచే జీవన్​రెడ్డి ఆధిక్యాన్ని చాటుకున్నారు. ఈ నియోజక వర్గంలో మొత్తం 1,15,458 ఓట్లు పోలయ్యాయి. తెల్లవారుజాము వరకు లెక్కింపు కొనసాగింది. తెరాస అభ్యర్థి చంద్రశేఖర్ గౌడ్​కు 17,268 ఓట్లు, భాజపా అభ్యర్థి సుగుణాకరరావుకు 15,077 ఓట్లు వచ్చాయి.

మండలిలో ప్రతిపక్షం ప్రాతినిధ్యం ఉన్నట్లే!

మండలిలో కాంగ్రెస్​కు మిగిలి ఉన్న ఇద్దరు సభ్యులు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. మిగిలిన వారు ఇప్పటికే తెరాసలో చేరిపోవడంతో ఇక మండలిలో ప్రాతినిధ్యం లేనట్లేనని భావిస్తున్న తరుణంలో జీవన్​రెడ్డి విజయం కాంగ్రెస్​కు సంతోషం కలిగించే అంశం.

ఇవీ చదవండి:16 సీట్లు మావే... దేశంలో కీలక పాత్ర మాదే...

Last Updated : Mar 27, 2019, 8:29 AM IST

ABOUT THE AUTHOR

...view details