విద్యుత్ ఉద్యోగులకు, సింగరేణి కార్మికులకు పూర్తి వేతనం అందించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను లేఖ రాశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది సేవలు మరవలేనివన్నారు. లాక్డౌన్ సందర్భంగా ప్రజలు ఇళ్లకే పరిమతమైన తరుణంలో విద్యుత్తు సరఫరాలో ఆటంకం కలగకుండా ఉద్యోగులు, సిబ్బంది పని చేస్తున్నారని పేర్కొన్నారు.
'వారి సేవలను గుర్తించి పూర్తి వేతనమివ్వండి' - carona virus
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ముఖ్యమంత్రికి ప్రత్యేక లేఖ రాశారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధించడం సరికాదన్నారు. విద్యుత్ ఉద్యోగులకు, సింగరేణి కార్మికులకు పూర్తి వేతనం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.
ముఖ్యమంత్రికి జీవన్‌రెడ్డి లేఖ
బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి కార్మికులు కూడా నిరంతరం పనిచేస్తున్నారు కాబట్టే.. విద్యుత్తు సరఫరాలో ఇబ్బందులు లేవన్నారు. వారి సేవలను గుర్తించి ఈ నెల పూర్తి వేతనం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ని కోరారు. వేతనాల్లో 50 శాతం కోత విధించడంపై ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారని జీవన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
ఇవీ చూడండి:కుమారుడి అంత్యక్రియలకు 2,000 కి.మీ ప్రయాణం!