తెలంగాణ

telangana

ETV Bharat / state

'నా గెలుపు ప్రభుత్వానికి చెంప పెట్టు' - CONGRESS

రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో పాటు పట్టభద్రుల స్థానంలోనూ అధికార తెరాస పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఘోరంగా ఓడిపోవడం ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదని జీవన్ రెడ్డి తెలిపారు.

'నా గెలుపు ప్రభుత్వానికి చెంప పెట్టు'

By

Published : Mar 27, 2019, 6:31 AM IST

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తో పాటు పట్టభద్రుల స్థానంలోనూతెరాసకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారంటే ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉందో అర్థం చేసుకోవచ్చని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ విజయం ప్రారంభమైందని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే తరహా ఫలితాలు ఉంటాయని అన్నారు. పట్టభద్రులు, నిరుద్యోగులు తనను గెలిపించి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు అవసరమని నిరూపించారని చెప్పారు. జీవన్ రెడ్డి గెలుపొందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేశ్రీధర్ ​బాబుతో పాటు కరీంనగర్ లోక్​సభ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కౌంటింగ్ కేంద్రానికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

'నా గెలుపు ప్రభుత్వానికి చెంప పెట్టు'

ABOUT THE AUTHOR

...view details