జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ప్రజలందరూ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని వ్యాధి నివారణ కోసం కృషి చేస్తున్న వారందరినీ అభినందిస్తూ సాయంత్రం చప్పట్లతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాను మార్మోగించారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల్లో తమ నివాసాల్లోనే ఉండి కర్ఫ్యూను విజయవంతం చేశారు.
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సీపీ సత్యనారాయణ ఇళ్లకే పరిమితమై సాయంత్రం చప్పట్లు కొట్టి కర్ఫ్యూను విజయవంతం చేశారు. కరోనా నియంత్రణ కోసం కృషి చేస్తున్న మున్సిపల్ సిబ్బంది, వైద్యులు, పోలీసులకు కలెక్టర్ సిక్త పట్నాయక్, అదనపు కలెక్టర్ రవీందర్ చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపారు.