Pawan Kalyan Telangana tour : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 24న పవన్ కొండగట్టు ఆంజనేయ స్వామి, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలను సందర్శించనున్నారు. రాజకీయ పర్యటనల కోసం ఇటీవల కొనుగోలు చేసిన వారాహి వాహనానికి కొండగట్టు అంజన్న ఆలయ సన్నిధిలో సంప్రదాయ పూజ జరపాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. 2009లో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అత్యంత శక్తివంతమైన విద్యుత్ తీగలు తగిలి ప్రమాదానికి గురి కాగా.. కొండగట్టు ఆంజనేయస్వామి కటాక్షంతోనే ప్రమాదం నుంచి బయటపడినట్లు పవన్ ప్రగాఢంగా విశ్వసిస్తారు.
పవన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన ఖరారు.. కొండగట్టులో 'వారాహి'కి పూజలు - కరీంనగర్ లో వారాహి పూజ
Pawan Kalyan Telangana tour : ఈ నెల 24న కొండగట్టు, ధర్మపురిలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు. కొండగట్టు అంజన్న ఆలయంలో ‘వారాహి’కి వాహనపూజ నిర్వహించనున్నారు. పూజ అనంతరం పార్టీ తెలంగాణ నేతలతో పవన్ సమావేశం కానున్నారు. తెలంగాణలో పార్టీ వ్యూహంపై నేతలకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు.
అందువల్ల తలపెట్టే అతి ముఖ్యమైన కార్యక్రమాలు కొండగట్టు ఆలయం నుంచి ప్రారంభించడం శుభసూచకంగా పవన్ భావిస్తారు. రాజకీయ క్షేత్ర పర్యటనల కోసం రూపొందించిన వారాహి వాహనాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. పూజా కార్యక్రమం అనంతరం తెలంగాణకు చెందిన ముఖ్య నాయకులతో పవన్ సమావేశమవుతారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం ధర్మపురి క్షేత్రాన్ని సందర్శించి 32 నారసింహ క్షేత్రాల సందర్శన కోసం చేపట్టే అనుష్టుప్ నారసింహ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
ఇవీ చదవండి: