కరీంనగర్లో కరోనా వైరస్ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోన్న తరుణంలో బాధితులకు అండగా ఉండేందుకు జమాతే ఇస్లామీ హింద్ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. కుల, మతాలకు అతీతంగా.. 25 మంది వైద్యుల బృందం ఆధ్వర్యంలో 24 గంటల పాటు సేవలు అందించనున్నట్లు తెలిపారు.
కరోనా బాధితులకు సేవలందించేందుకు కుటుంబసభ్యులు సైతం ముందుకు రావడం లేదని.. ఫలితంగా బాధితులు అనేక ఇబ్బందులు పడుతున్నారని జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షులు ఖైరుద్దీన్ పేర్కొన్నారు. కొవిడ్ లక్షణాలు కనిపించగానే బాధితులు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. అవసరమైతే సూచనలు, అత్యవసరమైతే ఆక్సిజన్ సహాయం కూడా అందించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.