జలమే జగతికి జీవనాధారం. అలాంటి జలాలను పొదుపుగా వాడుకుంటూ భవిష్యత్ తరాల మనుగడకు దోహదం చేయాలని జల శక్తి అభియాన్ అధికారుల బృందం తెలిపింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల, వెదిర గ్రామాల్లో చేపట్టిన జల సంరక్షణ పనులను వారు పరిశీలించారు. వెలిచాలలో ఇంకుడు గుంతల నిర్మాణం, ప్రభుత్వ స్థలాల్లో నీటి గుంటలు వినియోగ తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛందంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ప్రత్యేక అధికారి సతీందర్ పాల్ సూచించారు. వెలిచాల గ్రామపంచాయతీ ముందు భాగంలో కొత్తగా మొక్కలు నాటారు.
కరీంనగర్లో జలశక్తి అభియాన్ సభ్యుల పర్యటన - కరీంనగర్లో జలశక్తి అభియాన్ సభ్యుల పర్యటన
కరీంనగర్ జిల్లాలో జలసంరక్షణ పనులను జలశక్తి అభియాన్ బృందం సభ్యులు పరిశీలించారు. నీటి సంరక్షణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

కరీంనగర్లో జలశక్తి అభియాన్ సభ్యుల పర్యటన