అంబేడ్కర్ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ తీసుకుని ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు పార్లమెంటు సభ్యులు వినోద్‌కుమార్ ధ్రువపత్రాలు అందించారు.
ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందేందుకు కృషిచేయాలి
By
Published : Feb 9, 2019, 8:50 PM IST
ఉద్యోగాలు పొందిన వారికి ధ్రువపత్రాలు ప్రదానం
కొలువు సాధించిన తర్వాత ఉన్నత స్థాయిలో నిలిచేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని ఎంపీ వినోద్ కుమార్ సూచించారు. కరీంనగర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు ధ్రువపత్రాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.