తాను చేసింది తప్పేనని.. పెద్ద మనసుతో క్షమించాలని.. పార్టీకి నష్టం కలిగించే పనులు ఇంకోసారి చేయనని.. ఇదే విషయం అసెంబ్లీలో రామ్‌కు చెప్పానని.. అంటూ ఈటల రాజేందర్.. ముఖ్యమంత్రికి రాసినట్లుగా ఓ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అయితే ఈటల రాసినట్లుగా ప్రచారం జరుగుతున్న లేఖలో ఏముంది..
'తెరాసలో గత 20 ఏళ్లుగా మీతో సాన్నిహిత్యం చాలా గొప్పది. మీతో పనిచేసిన ప్రతిక్షణం నేను రాజకీయంగా, వ్యక్తిగతంగా చాలా నేర్చుకున్నాను. మీరు పార్టీలో నా స్థాయికి మించి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఆ విషయం ఇప్పటికీ నాకు గుర్తుంది. మీరిచ్చిన అవకాశాలతో హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచాను.. నాకు అదే పెద్ద పదవని అనుకున్నాను.. కానీ ఎందరినో కాదని.. తెరాస శాసనసభ పక్ష నేతగా నాకు అవకాశం కల్పించారు. ఆ ప్రోత్సాహాన్ని ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ఉద్యమ సమయం నుంచి వేలు పట్టి నడిపించారు. గత ఇరవై ఏళ్లుగా సొంత తమ్ముడిలా భావిస్తూ వస్తున్నారు. మీరు అవకాశం ఇవ్వకుంటే నేను ఇంతటి వాడిని అయ్యేవాడిని కాదు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తగిన గుర్తింపు ఇచ్చారు. రెండు సార్లు మంత్రిగా అవకాశం ఇచ్చారు.
'బెంగళూరు, పూణే సమావేశాలకు అందుకే వెళ్లాను..'
కానీ నిన్నటి నుంచి జరిగిన పరిణామాలు నన్ను తీవ్రంగా బాధించాయి. నాపై వచ్చిన ఆరోపణలు కొన్ని ఛానళ్లలో రావడం తీవ్రంగా బాధించింది. నేను చేసిన కొన్ని పనులు తప్పే కావొచ్చు. కానీ ఈ పనులు కొందరు తప్పుదోవ పట్టించడం వల్ల చేయాల్సి వచ్చిందే కానీ.. పార్టీ, మీ మీద ఎల్లప్పుడూ అపార గౌరవం ఉంది. బెంగళూరు, పూణేలో సమావేశాలకు కూడా కొందరు తప్పుదోవ పట్టించడం వల్లనే వెళ్లాల్సి వచ్చింది. తప్పితే నాకు ఇతర ఆలోచనలు ఏమీ లేవు. అలా సమావేశాలు పెట్టడం, పార్టీకి ఇబ్బంది కలిగేలా కొన్ని రకాల పనులు చేయడం మూమ్మాటికీ తప్పేనని ఒప్పుకుంటున్నాను. నన్ను మరోసారి తమ్ముడిలా భావించి.. తప్పును సరిదిద్దుకొనే అవకాశం ఇవ్వగలరు. జరిగిన పరిణామాల పట్ల నేను తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఇక నుంచి అలాంటి తప్పులను గానీ.. పార్టీకి ఇబ్బంది కలిగించే ఎలాంటి పనులు చేయనని మీకు మాట ఇస్తున్నాను.
'రామ్‌తో అదే చెప్పాను..'