కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ చెల్పూర్ గ్రామానికి చెందిన ఆకునూరి రవికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కొడుకు వంశీక్రిష్ణ(16)ను హన్మకొండలోని ఓ ప్రైవేటు ఇంటర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదివిస్తున్నాడు. అయితే తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తన తల్లిదండ్రుల కలల్ని నెరవేర్చలేనేమోనని.. ఇంటర్ ఫలితాలలో తాను ఫెయిల్ అవుతాననే భయంతో పురుగుల మందు తాగి వంశీక్రిష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఇంటర్లో ఫెయిల్ అవుతానేమోనని విద్యార్థి బలవన్మరణం - inter meadiate student suicide in karimnagar
పరీక్షలు ఉత్తీర్ణత సాధించలేమోననే మనస్థాపంలో ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి బలవన్మరణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చెల్పూర్లో చోటుచేసుకుంది.
![ఇంటర్లో ఫెయిల్ అవుతానేమోనని విద్యార్థి బలవన్మరణం inter student suicide in karimnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7663606-1040-7663606-1592460846386.jpg)
ఇంటర్లో ఫెయిల్ అవుతానేమోనని ఓ విద్యార్థి ఆత్మహత్య
అప్పటికే వంశీక్రిష్ణ మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. దీనితో కుటుంబమంతా గుండెలవిసేలా విలపించారు. చేతికందిన ఒక్కగానొక్క కొడుకు మృతితో వంశీక్రిష్ణ తండ్రి నిశ్చేష్ఠుడయ్యాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విద్యార్థి తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.