జేఎన్‌టీయూ ఇంటర్ కాలేజ్ బీ జోన్ ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ఈ పోటీలకు వేదికగా మారింది. పోటీలను కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్. షమిత ప్రారంభించారు. వాలీ బాల్, త్రో బాల్, బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నీస్, షటిల్ వంటి విభాగాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ , ఖమ్మం ఉమ్మడి జిల్లాలకు చెందిన 20 కళాశాలలు ఈ పోటీలో పాల్గొన్నాయి.
'హుజూరాబాద్‌లో ఇంటర్ కాలేజీ స్పోర్ట్స్ మీట్' - KITS ENGINEERING COLLEGE
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని సింగపూర్ గ్రామ పరిధిలో కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలకు సుమారు 20 కళాశాలలు పాల్గొన్నాయి.
అట్టహాసంగా ఇంతర్ కళాశాలల క్రీడా పోటీలు
సుమారు 600 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు తరలివచ్చారు. విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొంటూ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. తోటి విద్యార్థులు ఆసక్తిగా పోటీలను తిలకిస్తున్నారు. రెండు రోజుల పాటు ఈ క్రీడలు కొనసాగనున్నాయి. క్రీడా పోటీలతో కళాశాలలో సందడి వాతావరణం నెలకొంది.
ఇవీ చూడండి : స్తంభించిన ట్రాఫిక్... ఉద్యోగులు, విద్యార్థుల అవస్థలు