తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్యం అందక శిశువు మృతి

ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం పేదలపాలిట శాపంగా మారింది. తరచూ ఇలాంటి ఘటనలు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. వైద్య సౌకర్యాలు సైతం దేవతా వస్త్రాన్ని తలపిస్తున్నాయి.

శిశువు మృతి

By

Published : Feb 20, 2019, 11:39 PM IST

శిశువు మృతి
కరీంనగర్​లోని మాతా శిశు కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్​కి చెందిన స్వప్న పురిటి కోసం మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రిలో రక్త పరీక్ష సామగ్రిలేనందున వైద్య పరీక్షలకు ఆలస్యం అయింది. ప్రసవం అయిన వెంటనే పసికందు మృతిచెందింది.అంతావాళ్లే చేశారునొప్పులు ఎక్కువయ్యాయని చెప్పినా సిబ్బంది పట్టించుకోలేదని బాధితురాలు వాపోయింది. వైద్య సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే తన పాప దక్కేదని కన్నీళ్లపర్యంతమైంది. నర్సులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవలని వేడుకుంటున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details