తెలంగాణ

telangana

ETV Bharat / state

Subsidies to Industries: 'ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వ రాయితీలు అందట్లేదు' - government subsidies

రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగాలకు ఎనలేని ప్రోత్సాహకాలు కల్పిస్తోంది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు... సింగిల్‌ విండో పద్ధతిలో(single window system) అనుమతులివ్వడంతోపాటు.... పెట్టుబడి రాయితీలు (Subsidies to Industries) కల్పిస్తామని భరోసా కల్పిస్తున్నాయి. ప్రకటనలు బాగానే ఉన్నా... రాయితీలు మాత్రం రావడం లేదన్న నిరుత్సాహం ఆయా వర్గాల్లో కనిపిస్తోంది.

Subsidies to Industries
పారిశ్రామిక రంగాలకు ప్రభుత్వ రాయితీలు

By

Published : Nov 18, 2021, 2:28 PM IST

పారిశ్రామిక రంగాలకు ప్రభుత్వ రాయితీలు

రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి వెన్నుదన్నుగా ఉండాలనే ఉద్దేశంతో.... ప్రభుత్వం ఎన్నో రకాల రాయితీల (Subsidies to Industries)ను ప్రకటించింది. ఫలితంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నో చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఊపిరి పోసుకున్నాయి. గ్రానైట్‌, రైస్‌మిల్లులు, పవర్‌లూం పరిశ్రమలు పెద్దఎత్తున ఏర్పాటయ్యాయి. టీ-ఫ్రైడ్ పథకం ద్వారా పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చే పురుషులకు 35శాతం, మహిళలకు 45శాతం రాయితీ అందిస్తోంది. విద్యుత్‌ బిల్లుల్లోనూ రాయితీ (Subsidies to Industries) కల్పిస్తోంది. మరోవైపు టీ-ఐడియా పథకంలో భాగంగా పెట్టుబడి రాయితీ కింద పురుషులకు 15శాతం 20లక్షల వరకు, స్త్రీలకు 25శాతం 30లక్షల వరకు రాయితీ ఇవ్వడంతోపాటు… విద్యుత్‌ యూనిట్‌కు రూపాయి చెల్లిస్తామని పేర్కొంది. అయితే ముందుగా పూర్తి బిల్లు చెల్లిస్తేనే ఆ తర్వాత రాయితీ వస్తోందని పరిశ్రమల నిర్వాహకులు అంటున్నారు. విద్యుత్‌ రాయితీ (Subsidies to Industries) కోసం దరఖాస్తు చేసుకుంటే రాయితీలో సగం మాత్రమే వస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వం సింగిల్‌ విండో పద్ధతిలో అనుమతులు ఇచ్చినట్లే.... రాయితీలు (Government Subsidies to Industries) చెల్లించి ఔత్సాహికులను ఆదుకోవాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు.

''రైస్​ మిల్స్, ఆయిల్ మిల్స్​కు.. సబ్సిడీ, ఇన్సెంటీవ్​లు రావడంలేదు. తొందరగా వాటిని ఇస్తే.. ఈ పరిశ్రమలు కొత్త టెక్నిక్​లు ఉపయోగించి ముందుకు పోయే అవకాశముంటాది. ఇప్పటికైనా త్వరగా ఇన్సెంటీవ్​లను ప్రభుత్వం విడుదల చేయాలి. ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వ రాయితీలు (Government Subsidies to Industries) అందట్లేదు. రాయితీలు వస్తే పరిశ్రమలను అప్​గ్రేడ్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. పరిశ్రమలను అప్​గ్రేడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు ఏ ఇండస్ట్రీ నష్టాల్లో ఉంది... ఏ ఇండస్ట్రీ ఏం చేయాలనే సమగ్ర నివేదిక తయారు చేసి.. ప్రభుత్వానికి సమర్పించాలి. పరిశ్రమలకు విద్యుత్‌ బిల్లుల్లో ప్రభుత్వ రాయితీలు (Government Subsidies to Industries) కల్పిస్తుంది కానీ.. ముందుగా పూర్తి బిల్లు చెల్లిస్తేనే రాయితీ వస్తోంది. బిల్లు చెల్లించకముందే సబ్సిడీ ఇవ్వాలి.''

మునిందర్‌, అధ్యక్షుడు, ఛాంబర్ ఆఫ్ కామర్స్

పరిశ్రమలు ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వ రాయితీలు (Government Subsidies to Industries) అందడంలేదని పారిశ్రామిక వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా ఒడిదొడుకులను ఎదుర్కొంటున్న పరిశ్రమలకు.... ప్రభుత్వం చెల్లించాల్సిన రాయితీలు వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. మరోవైపు అధికారులు పారిశ్రామిక వేత్తల దరఖాస్తులను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు చెబుతున్నారు. పారిశ్రామిక వేత్తలకు సంబంధించిన రాయితీల (Government Subsidies to Industries)ను బడ్జెట్‌కు అనుగుణంగా ప్రభుత్వం చెల్లిస్తుందని వివరించారు.

ఇbr చూడండి:

ABOUT THE AUTHOR

...view details