కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ కోసం ప్రజలు తరలివస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో దాదాపు పదిహేను టీకా కేంద్రాలుండగా... కేవలం ఐదు సెంటర్లలో మాత్రమే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. టీకా కోసం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని స్థానికులు చెబుతున్నారు. నగరంలోని ఆర్టీసీ వర్క్ షాప్ ఆస్పత్రిలో టీకా కేంద్రం ఏర్పాటు చేయగా రోజూ దాదాపు 200 మంది వ్యాక్సిన్ తీసుకుంటున్నారు.
టీకా కేంద్రాల్లో పెరుగుతున్న రద్దీ.. కొరతే కారణమా? - తెలంగాణ వార్తలు
టీకా తీసుకోవడానికి ప్రజలు ఆసక్తి కనబర్చుతున్నారు. రెండో దశ ప్రభావంతో వ్యాక్సిన్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కరీంనగర్లో 15 కేంద్రాలుండగా కేవలం 5 సెంటర్లలో మాత్రమే టీకా ఇస్తున్నారని స్థానికులు వాపోయారు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వ్యాక్సినేషన్ సమస్యలు, వ్యాక్సిన్ కేంద్రాల్లో రద్దీ
వ్యాక్సిన్ కోసం వేకువజాము నుంచే క్యూలైన్లు కడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో ఫ్రంట్ లైన్ సిబ్బంది కుటుంబసభ్యులు నేరుగా వచ్చి వ్యాక్సిన్ తీసుకుంటున్నారని... తాము గంటలపాటు నిరీక్షించినా దొరకడం లేదని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికైనా వాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.