మత్తు పదార్థాలకు అలవాటు పడిన ఓ యువకుడు కరీంనగర్లో అర్ధనగ్నంగా వీరంగం సృష్టించాడు. లాక్ డౌన్ విరామ సమయంలో గీతాభవన్ నుంచి బస్టాండ్ వెళ్లే రహదారిలో వచ్చి పోయే వాహనాలను ఆపి వాటి పైకి ఎక్కుతూ.. హల్ చల్ చేశాడు.
మత్తు పదార్థాలకు అలవాటుపడి అర్ధనగ్నంగా యువకుడి హల్ చల్ - Karimnager district latest news
కరీంనగర్లో ఓ యువకుడు అర్ధనగ్నంగా వీరంగం సృష్టించాడు. మత్తు పదార్థాలకు అలవాటుపడి వచ్చి పోయే వాహనాలను ఎక్కుతూ హల్ చల్ సృష్టించాడు.
In Karimnagar, the young man was intoxicated and half-naked
యువకుడి బీభత్సంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీనిని వింతగా చూస్తున్న వారంతా 'గంజాయి మాస్టర్ ' అంటూ గెలిచేశారు. ఒక కారు పైకి ఎక్కిన ఆ యువకుని నుంచి తప్పించుకొనేందుకు కారు యజమాని విశ్వయత్నం చేశాడు. చివరికి అతన్ని స్థానికులు చెట్టుకు కట్టేయగా.. ఊపిరి పీల్చుకున్నారు. యువకుడు వరంగల్ జిల్లాకు చెందిన రమేష్‌గా గుర్తించారు.
ఇదీ చూడండి: Lockdown : సాయంత్రం 5 గంటల వరకు లాక్డౌన్ సడలింపు?