విద్యార్థులు తమ వ్యక్తిత్వాన్ని సంస్కరించుకునేందుకు సామాజిక సేవా కార్యక్రమాలు ఉపకరిస్తాయని కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. రామడుగు మండలం వెలిచాలలో ఏడు రోజుల జాతీయ సేవా పథకం శిబిరం ముగింపు సభలో ఆయన ప్రసంగించారు.
ఆకట్టుకున్న విద్యార్థుల నృత్యాలు - జాతీయ సేవా పథకం శిబిరం ముగింపు సభ
రామడుగు మండలం వెలిచాలలో ఏడు రోజుల జాతీయ సేవా పథకం శిబిరం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థులు చేసిన డాన్స్లు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆకట్టుకున్న విద్యార్థుల నృత్యాలు
ప్రభుత్వం సంక్షేమ పథకాలెన్ని ప్రవేశపెట్టినా ప్రజల పాత్ర ఉంటేనే ఆ లక్ష్యం నెరవేరుతుందన్నారు. కళాశాల విద్యార్థులు సామాజిక సేవా పనులు అలవర్చుకుని తమ వ్యక్తిత్వానికి పునాదులు వేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :బైకుపై నుంచి పడ్డవారిపై దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి