మహిళలపై జరుగుతున్న అత్యాచార కేసులపై పోలీసులు వెంటనే స్పందించాలని ప్రజా సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గజ్జల కాంతం కోరారు. కరీంనగర్లో విద్యార్థిని హత్యపై పోలీసుశాఖ ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.
'మహిళల అత్యాచార కేసులపై వెంటనే స్పందించాలి' - karimnagar district news today
మహిళలపై జరుగుతున్న అత్యాచార కేసులపై పోలీసులు వెంటనే స్పందించాలని ప్రజా సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గజ్జల కాంతం డిమాండ్ చేశారు. అప్పుడే వారికి రక్షణ దొరుకుతుందన్నారు.
'మహిళల అత్యాచార కేసులపై వెంటనే స్పందించాలి'
మహిళలపై చేయి వేయాలంటే భయం ఉండేలా కఠిన చట్టాలు తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిందితున్ని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆవేదన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపుల పట్ల చట్టాలు కఠినంగా ఉండాలన్నారు.
ఇదీ చూడండి : ఉత్పత్తి ఎక్కువ.. ఆదాయం తక్కువ..