తెలంగాణ

telangana

ETV Bharat / state

కాళేశ్వరం ప్రాజెక్టు ఎనిమిదో ప్యాకేజీ కాలువ మట్టి అక్రమంగా తరలింపు - కాళేశ్వరం ప్రాజెక్ట్ తాజా వార్తలు

కాళేశ్వరం ప్రాజెక్టు ఎనిమిదో ప్యాకేజీలోని కాలువ మట్టిని కొందరు అక్రమంగా తరలిస్తున్నారు. కొన్ని రోజుల వ్యవధిలోనే రెండెకరాల విస్తీరణంలోని మట్టి దిబ్బలు ఖాళీ చేశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.

Illegal soil removal
అక్రమంగా మట్టి తరలింపు

By

Published : Mar 28, 2022, 1:07 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టు ఎనిమిదో ప్యాకేజీలోని కాలువ మట్టిని కొందరు అక్రమంగా తరలిస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గాయత్రి పంప్ హౌస్ నుంచి గల గ్రావిటీ కాలువ మట్టిని గత కొన్ని రోజుల వ్యవధిలోనే రెండెకరాల విస్తీర్ణంలోని మట్టి దిబ్బలు ఖాళీ చేశారు.

ఖాళీ అవుతున్న మట్టి దిబ్బలు

కరీంనగర్ పట్టణంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఈ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. జేసీబీల సాయంతో మట్టిని తవ్వి టిప్పర్ల సహాయంతో రవాణా సాగిస్తున్నారు. దీనికి ఎలాంటి చలానాలు చెల్లించడం లేదు. నిత్యం వందల టిప్పర్ల రవాణా సాగిస్తున్న అధికారులు తనిఖీ చేసిన దాఖలాలు లేవు.

టిప్పర్లలో మట్టిని తరలిస్తున్నారు

దీన్ని అదుపు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం చేయడంతో రాత్రి పగలు తేడా లేకుండా మట్టిని రవాణా చేస్తున్నారు. ప్రభుత్వం టెండరు ప్రకటన జారీ చేస్తే ఖజానాకు లబ్ధి కలిగేదని స్థానికులు అంటున్నారు. మట్టిని అక్రమంగా తరలించే వాహనాలపై నిఘా ఏర్పాటు చేశామని త్వరలోనే పట్టుకుంటామని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: కరీంనగర్‌లో సైనిక్‌ స్కూల్‌కి కేంద్ర రక్షణశాఖ అనుమతి

ABOUT THE AUTHOR

...view details