కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రం శివారు వాగులో సమాధులు తవ్వి ఇసుక అక్రమ రవాణా చేశారు. రాత్రివేళ ప్రొక్లైనర్తో ఇసుక తవ్వడం వల్ల మృతదేహాలు, అస్థిపంజరాలు బయటపడ్డాయి.
సమాధులు తవ్వి ఇసుక అక్రమ రవాణా.. స్థానికుల ఆవేదన - illegal sand transport in karimnagar district
సమాధులు తవ్వి ఇసుక అక్రమ రవాణా చేసిన సంఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్ర శివారు వాగులో చోటుచేసుకుంది. అనారోగ్యంతో మృతి చెందిన స్థానికుణ్ని ఖననం చేయడానికి సమాధుల దిబ్బ వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు సమాధులు తవ్వి ఇసుక తీయడం చూసి ఆవేదన చెందారు.
సమాధులు తవ్వి ఇసుక అక్రమ రవాణా
అనారోగ్యంతో మృతి చెందిన స్థానికుణ్ని ఖననం చేసేందుకు వెళ్లిన బంధువులు.. సమాధులు తవ్వి ఇసుక తీయడం చూసి ఆశ్చర్యపోయారు. కుక్కలు అస్థిపంజరాలు తీసుకురావడం చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అర్ధరాత్రి ఇసుక అక్రమ రవాణాను అధికారులు కట్టడి చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.