కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో జనావాసాల్లో ప్రమాదకరంగా పేలుడు పదార్థాలను నిల్వచేసి విక్రయిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. చొప్పదండికి చెందిన వ్యక్తి అనేక సంవత్సరాలుగా అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి నిర్మాణాలకు ఉపయోగించే కంకర బస్తాల మధ్యలోంచి పేలుడు పదార్థాలను వెలికితీశారు.
అక్రమంగా పేలుడు పదార్థాలు విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్ట్ - illegal explosive vendor arrested in choppadandi
జనావాసాల్లో ప్రమాదకరంగా పేలుడు పదార్థాలను నిల్వచేసి విక్రయిస్తున్న వ్యక్తులను కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో అరెస్ట్ చేశారు. కంకర క్రషర్లు, వ్యవసాయ బావులు, ఇతర పేలుళ్లకు ఉపయోగించే డిటోనేటర్లు, బూస్టర్లు, అమ్మోనియం సంచులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.
అక్రమంగా పేలుడు పదార్థాలు విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్ట్
పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో కంకర క్రషర్లు, వ్యవసాయ బావులు, ఇతర పేలుళ్లకు ఉపయోగించే డిటోనేటర్లు, బూస్టర్లు, అమ్మోనియం సంచులు ఉన్నాయి. కాలం చెల్లిన లైసెన్స్ తో వ్యాపారం చేస్తున్న నిందితుడిని, పేలుడు పదార్థాల రవాణా చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.