తెలంగాణలో వానాకాలం సాగు చేసిన వరి, పత్తి, మొక్కజొన్న పంటలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ స్పష్టం చేశారు. పంటలకు పెట్టుబడి అందించడంతో పాటు ధాన్యం కొనుగోలుపై రాష్ట్రప్రభుత్వం శ్రద్ధ చూపుతోందన్నారు. ఐకేపీ సెంటర్లు, కో ఆపరేటివ్ సొసైటీలు, మార్కెటింగ్ శాఖల ద్వారా ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామన్నారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్, లక్ష్మీదేవిపల్లి, బూరుగుపల్లి, లింగంపల్లి, ర్యాలపల్లి, కొండయపల్లి, ఆర్ చర్లపల్లి, వెంకటాయపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
గంగాధర మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ కేంద్రాల ప్రారంభం - choppadandi mla ravishankar latest
గంగాధర మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. 17శాతం తేమకు లోబడి ధాన్యాన్ని తీసుకురావాలని రైతులను కోరారు. తాలు, పొల్లు లేకుండా ఆరబోసిన ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.
గంగాధర మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ కేంద్రాల ప్రారంభం
ధాన్యం 17శాతం తేమకు లోబడి తీసుకొస్తే.. ఏ-గ్రేడ్ రకానికి క్వింటాల్‌కు రూ.1,888, బీ-గ్రేడ్ రకానికి క్వింటాల్‌కు రూ.1,868 కనీస మద్దతు ధరను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. తాలు, పొల్లు లేకుండా ఆరబోసిన ధాన్యాన్ని తీసుకొచ్చి మంచి ధర పొందాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రైతులను కోరారు. తేమ శాతం ఎక్కువగా ఉన్న ధాన్యానికి తూకం నిలిపి వేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:ధాన్యం కొనుగోళ్లలో సమస్యలా..? వెంటనే ఫోన్ చేయండి