తెలంగాణ

telangana

ETV Bharat / state

350 మంది ఖైదీలకు ఇఫ్తార్​ విందు - 350 మంది ఖైదీలకు ఇఫ్తార్​ విందు

కరీంనగర్​ జిల్లా జైలులో ఖైదీలకు ఎంఐఎం ఆధ్వర్యంలో ఇఫ్తార్​ విందు ఏర్పాటు చేశారు. 350 మంది ఖైదీలకు సరిపడా చికెన్​ బిర్యానీ సామగ్రిని జైలు అధికారులకు నాయకులు అందించారు.

iftar dinner to prisoners in karimnagar
350 మంది ఖైదీలకు ఇఫ్తార్​ విందు

By

Published : May 24, 2020, 8:23 PM IST

రంజాన్​ సందర్భంగా కరీంనగర్ జిల్లా జైలులో 350 మంది ఖైదీలకు ఎంఐఎం ఆధ్వర్యంలో ఇఫ్తార్​ విందు ఏర్పాటు చేశారు. ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం, అహ్మద్ హుస్సేన్ ఆదేశాల మేరకు ఆ పార్టీ కార్పొరేటర్లు అఖిల్ ఫిరోజ్, మహమ్మద్ షర్ఫుద్దీన్, నాయకుడు యూసుఫోద్దీన్ జైలులోని అధికారులకు షీర్ ఖుర్మా, చికెన్ బిర్యానీ సామగ్రిని అందజేశారు.

ప్రతియేటా ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో జైలులో ఖైదీలకు నెలరోజులు ఇఫ్తార్ విందు, పండగ రోజు షీర్ ఖుర్మా ఏర్పాట్లు చేశామని.... ఈ ఏడాది చికెన్ బిర్యానీ ఏర్పాటు చేశామని అహ్మద్ హుస్సేన్ తెలిపారు.

సంబంధిత కథనం:గొర్రెకుంట బావిలో మృతదేహాలపై వీడుతున్న మిస్టరీ

ABOUT THE AUTHOR

...view details