ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏకీకృత విధానాన్ని తీసుకొస్తానని చెప్పి మోసం చేశారని సీఎం కేసీఆర్పై మండిపడ్డారు. ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని జాక్టో ఛైర్మన్ ప్రభాకర్ రావు ఎద్దేవా చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే సెప్టెంబర్ 1న ఛలో హైదరాబాద్ నిర్వహిస్తామని హెచ్చరించారు.
' మా సమస్యలు తీర్చకపోతే ఛలో హైదరాబాద్ నిర్వహిస్తాం' - undefined
కరీంనగర్ జిల్లా పాలనాధికారి కార్యాలయం ఎదుట జాక్టో ప్రతినిధులు ధర్నా చేపట్టారు. తమ సమస్యలను తక్షణమే తీర్చకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని జాక్టో ఛైర్మన్ ప్రభాకర్ రావు హెచ్చరించారు.

సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ మమ్మల్ని మోసగించారు : జాక్టో
సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ మమ్మల్ని మోసగించారు : జాక్టో
ఇవీ చూడండి : నామినేటెడ్ పదవుల భర్తీపై కేసీఆర్ నజర్!