కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో బలమైన గాలులతో వడగళ్ల వాన కురిసింది. మానకొండూరు పరిధిలో భారీ స్థాయిలో వర్షం పడింది. తిమ్మాపూర్, శంకరపట్నంలో జల్లులు కురిశాయి. గన్నేరువరం మండలంలో వాతావరణం మేఘావృతమై మబ్బులతో కమ్మేసింది. పూతకొచ్చిన పంట వాన తాకిడికి నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మానకొండూరులో భారీ వడగళ్ల వాన - ICE CUBE RAINS IN MAANAKONDURU KARIMNAGAR DISTRICT
భారీ వడగళ్ల వాన వల్ల పూతకొచ్చిన పంట దక్కదేమే అని కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గ రైతులు ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది.
వడగళ్ల వానతో ఆందోళనలో రైతులు