కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో సమ్మె విరమించి విధుల్లోకి చేరేందుకు డిపో వద్దకు వచ్చిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. విధుల్లోకి చేరేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడం వల్ల డిపో ఎదుటే నిరసనకు దిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించారు.
హుజూరాబాద్‌లో ఆర్టీసీ కార్మికుల అరెస్టులు - హుజూరాబాద్‌లో ఆర్టీసీ కార్మికుల అరెస్టులు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో విధుల్లో చేరేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు.
హుజూరాబాద్‌లో ఆర్టీసీ కార్మికుల అరెస్టులు
ప్రభుత్వానికి, ఆర్టీసీ అధికారులకు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. తిరిగి కార్మికులు ఇళ్లకు వెళ్తుండగా... పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. తాత్కాలిక ఉద్యోగులతో బస్సులను యథావిధిగా నడిపించారు.
ఇవీ చూడండి: ఈనెల 28న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. ఆర్టీసీపై చర్చ!!