కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీ ప్రజలు తమకు తాము స్వచ్ఛంద లాక్డౌన్ విధించుకున్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలను 15 రోజుల పాటు ఉదయం 11 గంటల వరకే తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం 11 గంటల దాటిన తర్వాత అన్ని దుకాణాలను మూసివేశారు.
స్వచ్ఛంద లాక్డౌన్లో హుజూరాబాద్ ప్రజలు - స్వచ్చంధ లాక్డౌన్ విధించుకున్న హుజూరాబాద్ ప్రజలు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీ ప్రజలు స్వచ్ఛంద లాక్డౌన్ విధించుకున్నారు. ఉదయం 11 గంటల తర్వాత దుకాణాలన్నీ మూసివేయాలని... ప్రజలెవరూ రోడ్లపైకి రాకూడదని నిర్ణయించుకున్నారు.
స్వచ్ఛంద లాక్డౌన్లో హుజూరాబాద్ ప్రజలు
అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని మున్సిపల్ ఛైర్ పర్సన్ గందె రాధిక విజ్ఞప్తి చేశారు. ఒకవేళ బయటకు వచ్చినా మాస్కు ధరించి... భౌతిక దూరం పాటించాలని సూచించారు. జనాలు లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అంబేడ్కర్ ప్రధాన కూడలి వద్ద జన సంచారం లేక రోడ్డంతా బోసిపోయింది. మొదటి రోజు లాక్‌డౌన్‌ను ఛైర్‌పర్సన్‌తో పాటు మున్సిపాలిటీ పాలకవర్గం పర్యవేక్షించారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..