తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఈటల తన పదవికి రాజీనామా చేయాలి' - koushik reddy allegations etela rajender

పేదల అసైన్డ్ భూములు కాజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నమంత్రి ఈటల వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. బినామీల ద్వారా ఈటల కమీషన్లు వసూల్ చేశారని ఆరోపించారు.

padi koushik reddy, padi koushik reddy on etela, allegations on etela
పాడి కౌశిక్ రెడ్డి, ఈటలపై పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు, ఈటలపై ఆరోపణలు

By

Published : May 1, 2021, 6:22 PM IST

కొనుగోలు చేయడానికి వీలులేని భూములు కొన్నట్లు ఒప్పుకున్న మంత్రి ఈటల వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే ఈటలను అరెస్టు చేసి సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. మెడికల్ కాలేజీ, ఐదు ఎకరాల్లో ఇల్లు ఎలా కట్టారని ప్రశ్నించారు.

బీసీలకు ప్రతినిధిని అని చెప్పుకునే ఈటల.. కుమార్తె, కుమారునికి ఇతర సామాజిక వర్గం పేరు ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో అవినీతి లేదన్న ఈటల.. బినామీల ద్వారా ఈటల కమీషన్లు వసూల్ చేశారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details