కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నిక(huzurabad by poll) సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ(nominations) కొనసాగుతుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు(independent) నామపత్రాలను దాఖలు చేస్తున్నారు. గురువారం తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి.
huzurabad nominations: హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం - తెలంగాణ తాజా వార్తలు
హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా (huzurabad by poll) నామపత్రాలు సమర్పించేందుకు గడువు సమీపిస్తుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు జోరుగా నామినేషన్లు వేస్తున్నారు. ఇవాళ తొమ్మిది మంది నామినేషన్లు దాఖలు చేశారు.
![huzurabad nominations: హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం nomitions](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13289688-977-13289688-1633616137090.jpg)
భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్(etela rajender) తరఫున ఆయన మద్దతుదారులు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీందర్‌రెడ్డికి నామపత్రాలను అందించారు. ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున(etela jamuna)... స్వతంత్ర అభ్యర్థిగా ఆమె మద్దతుదారులు నామపత్రాలను సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ తరఫున ఆయన మద్దతు దారులు నామినేషన్లు వేశారు. వీరితో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు సైతం నామపత్రాలను దాఖలు చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad by poll)ల పోలింగ్ అక్టోబర్ 30న జరగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఇదీ చూడండి:ETELA RAJENDER : ఓట్ల కోసమే దళితబంధు.. కేసీఆర్‌ది నిజమైన ప్రేమకాదు: ఈటల