హుజూరాబాద్ తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్... ప్రగతిభవన్‌లో తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఉపఎన్నికల్లో తనకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. అభ్యర్థి కోసం ముమ్మర కసరత్తు చేసిన అధికార తెరాస.. తెరాస విద్యార్థి విభాగం అధ్యక్షుడు, కరీంనగర్ జిల్లా వీణవంక మండలం, హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ యాదవ్‌కు అవకాశం ఇచ్చారు.
హుజూరాబాద్ నియోజకవర్గానికే చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఆయన సామాజిక వర్గంతో పాటు స్థానికుడు కావటం కలిసి వచ్చే అంశం కానుందని తెరాస భావిస్తోంది. దళిత బంధు ప్రభావం.. కలిసివస్తుందని, నియోజకవర్గంలో మెజారిటీ వర్గంగా ఉన్న బీసీ ఓట్లపై గురి పెట్టిన కేసీఆర్... ఈ వ్యూహంలో భాగంగానే గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు టికెట్ ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు హుజూరాబాద్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు గెల్లు శ్రీనివాసయాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. చదువుకునే రోజుల నుంచి అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నానని... తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. ప్రజలకు పనిమనిషిలా సేవ చేసుకుంటానని.. హుజూరాబాద్ అభ్యర్థిగా ప్రకటించిన సమయంలోనే గెల్లు శ్రీనివాస్ చెప్పారు.
ఇవీచూడండి: