హుజూరాబాద్ ఉపఎన్నిక మొదటి నుంచి రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేపింది (huzurabad by election). మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసి భాజపాలో చేరి బరిలో దిగగా... తెరాస అన్ని సామాజిక సమీకరణల తర్వాత గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను పోటీలోకి దింపింది. నియోజకవర్గంలో గెలవాలనే పట్టుదలతో మండలాలవారీగా మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
పథకాలే గెలిపిస్తాయనే ధీమాతో..
ఆర్థికమంత్రి హరీశ్‌రావు (minister harish rao) తొలి నుంచి ప్రచార బాధ్యతలు భుజాన వేసుకుని పార్టీ శ్రేణులను సమన్వయపరిచారు. గడపగడపకు తిరుగుతూ... సామాజికవర్గాల వారీగా... సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. దళితబంధు సహా పలు ప్రభుత్వ పథకాలను అమలుచేసి నియోజకవర్గ అభివృద్ధికి అనేక హామీలు గుప్పించారు. మునుపెన్నడూ లేనంతగా తెరాస రాజకీయ యంత్రాంగాన్ని మోహరించింది. కేంద్ర ప్రభుత్వ విధానాలతో ధరలు పాపంగా పెరిగాయని పెట్రో ఉత్పత్తులతో పాటు గ్యాస్ రేటు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందని ప్రచారాస్త్రాలుగా వినియోగించారు. పథకాల అమలు, లబ్ధిదారులకు అందించిన సంక్షేమ ఫలాలు తప్పక గెలిపిస్తాయని నమ్మకంతో అధికార పార్టీ ధీమాగా ఉంది.
ఆత్మగౌరవ నినాదంతో..