తెలంగాణ

telangana

ETV Bharat / state

LIVE UPDATES: హుజూరాబాద్‌లో గొప్ప విజయం సాధించబోతున్నాం: హరీశ్‌రావు - హుజూరాబాద్ ఉపఎన్నిక 2021

Huzurabad by-election polling
Huzurabad by-election polling

By

Published : Oct 30, 2021, 6:27 AM IST

Updated : Oct 30, 2021, 9:49 PM IST

21:48 October 30

  • తెరాస విజయానికి కష్టపడిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు: హరీశ్‌రావు
  • హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఓటర్లు చైతన్యాన్ని చాటారు: హరీశ్‌రావు
  • ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు: హరీష్ రావు

20:12 October 30

రాత్రి 7 గం. వరకు 86.33 శాతం పోలింగ్ నమోదు

  • హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది: సీఈవో
  • ఫిర్యాదులపై ఎన్నికల పరిశీలకులు వివరాలు సేకరిస్తున్నారు: సీఈవో
  • కొన్ని ఫిర్యాదులపై కేసులు నమోదు చేశారు: సీఈవో శశాంక్‌ గోయల్‌
  • ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలు సీజ్‌ చేస్తున్నాం: సీఈవో
  • కరీంనగర్‌లోని డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్‌ రూమ్ ఏర్పాటు 
  • స్ట్రాంగ్‌ రూమ్‌కు రాష్ట్ర, కేంద్ర పోలీసు బలగాలతో భద్రత ఉంటుంది
  • 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఉపఎన్నికలో పోలింగ్ శాతం పెరిగింది 
  • ఓటర్లలో చైతన్యం పెరిగినందుకు సంతోషం: శశాంక్‌ గోయల్‌
  • అన్ని పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి: సీఈవో

19:03 October 30

ముగిసిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌

  • ముగిసిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ 
  • పోలింగ్‌ కేంద్రాల్లో క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం
  • చిన్నచిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా ఉప ఎన్నిక పోలింగ్‌ 
  • ఉదయం కొన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద చెదురుమదురు ఘటనలు
  • హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదు
  • సాయంత్రం 5 గం. వరకు 76.26 శాతం పోలింగ్ నమోదు
  • హుజూరాబాద్‌లో 2018 ఎన్నికల్లో 84.5 శాతం పోలింగ్‌ నమోదు
  • ఉపఎన్నిక పోలింగ్‌ 2018 నాటి పోలింగ్‌ శాతాన్ని మించే అవకాశం 
  • నవంబర్‌ 2న ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు 

17:14 October 30

  • కొనసాగుతున్న హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్‌
  • హుజూరాబాద్‌లో  5 గం. వరకు 76.26 శాతం పోలింగ్‌ 

16:15 October 30

  • కమలాపూర్‌ మం. గూడురులో తెరాస, భాజపా వర్గీయుల ఘర్షణ
  • తెరాస వర్గీయులు డబ్బు పంచుతున్నారని భాజపా వర్గీయుల ఆరోపణ
  • పరస్పర ఆరోపణలతో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం
  • తెరాస, భాజపా వర్గీయులకు సర్దిచెప్పి పంపేసిన పోలీసులు

16:15 October 30

  • కమలాపూర్‌లో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన సీఈవో 
  • 306 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది: సీఈవో
  • ఇప్పటివరకు 88 ఫిర్యాదులు అందాయి: సీఈవో శశాంక్‌ గోయల్‌
  • ఫిర్యాదులపై ఎన్నికల పరిశీలకులు వివరాలు సేకరిస్తున్నారు: సీఈవో
  • డబ్బు పంపిణీపై ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం: సీఈవో
  • విచారణలో నిజాలు తేలితే ఎన్నికల తర్వాత కూడా చర్యలు: సీఈవో

15:08 October 30

61.66 శాతం పోలింగ్

  • కొనసాగుతున్న హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్‌
  • హుజూరాబాద్‌లో 3 గం. వరకు 61.66 శాతం పోలింగ్‌ 

13:24 October 30

ఒంటిగంట వరకు 45.05 శాతం పోలింగ్

  • హుజూరాబాద్‌ మండలంలో ఒంటిగంట వరకు 45.05 శాతం పోలింగ్
  • వీణవంక మండలంలో ఒంటిగంట వరకు 47.65 శాతం పోలింగ్
  • జమ్మికుంట మండలంలో ఒంటిగంట వరకు 45.36 శాతం పోలింగ్
  • ఇల్లందకుంట మండలంలో ఒంటిగంట వరకు 42.09 శాతం పోలింగ్
  • కమలాపూర్‌ మండలంలో ఒంటిగంట వరకు 46.76 శాతం పోలింగ్

13:04 October 30

కొనసాగుతున్న హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్‌

  • కొనసాగుతున్న హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్‌
  • మధ్యాహ్నం ఒంటిగంట వరకు 45.63 శాతం పోలింగ్ నమోదు
  • రాత్రి 7 గంటల వరకు కొనసాగనున్న ఉపఎన్నిక పోలింగ్‌

12:40 October 30

వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో ఉద్రిక్తత

  • హిమ్మత్‌నగర్‌లో పోలింగ్ కేంద్రానికి వచ్చిన భాజపా నేత తుల ఉమ
  • భాజపా నేత తుల ఉమను అడ్డుకున్న తెరాస శ్రేణులు
  • ఇతర ప్రాంతాల నుంచి ఎందుకు వచ్చారని అడ్డుకున్న తెరాస శ్రేణులు
  • తుల ఉమ వాహనాన్ని కాళ్లతో తన్నిన తెరాస శ్రేణులు
  • తెరాస, భాజపా శ్రేణుల మధ్య పరస్పర దాడులు
  • హిమ్మత్‌నగర్‌లో ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

12:24 October 30

భాజపా, తెరాస శ్రేణుల మధ్య తోపులాట

  • జమ్మికుంట 28వ వార్డులో భాజపా, తెరాస శ్రేణుల వాగ్వాదం
  • తెరాస కౌన్సిలర్ దీప్తి ఇంట్లో డబ్బులు ఉన్నాయని భాజపా ఆరోపణ
  • భాజపా, తెరాస శ్రేణుల మధ్య తోపులాట

12:23 October 30

భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌పై తెరాస ఫిర్యాదు

  • కేంద్ర ఎన్నికల సంఘానికి తెరాస ఫిర్యాదు
  • భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌పై తెరాస ఫిర్యాదు
  • నిబంధనలకు విరుద్ధంగా మీడియాలో వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు

12:06 October 30

హుజూరాబాద్‌లో సీఈవో శశాంక్ గోయల్ పర్యటన

  • హుజూరాబాద్‌లో సీఈవో శశాంక్ గోయల్ పర్యటన
  • హుజూరాబాద్‌లో పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న సీఈవో శశాంక్ గోయల్

12:02 October 30

'తెరాస దుర్వినియోగానికి పాల్పడుతోంది'

  • బుద్ధభవన్‌లో అధికారులను కలిసిన తెలంగాణ విద్యార్థి ఫెడరేషన్
  • హుజూరాబాద్‌లో తెరాస దుర్వినియోగానికి పాల్పడుతోందని ఫిర్యాదు

11:28 October 30

చల్లూరులో భాజపా శ్రేణుల ఆందోళన

  • వీణవంక మండలం చల్లూరులో భాజపా శ్రేణుల ఆందోళన
  • మార్కెట్ ఛైర్మన్ బాలకిషన్‌రావు ఇంట్లో డబ్బులు పంచుతున్నారని ధర్నా
  • చల్లూరులో భాజపా, తెరాస శ్రేణుల మధ్య వాగ్వాదం

11:06 October 30

ఉదయం 11 గంటల వరకు 33.27 శాతం పోలింగ్ నమోదు

  • కొనసాగుతున్న హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్‌
  • ఉదయం 11 గంటల వరకు 33.27 శాతం పోలింగ్ నమోదు
  • రాత్రి 7 గంటల వరకు కొనసాగనున్న ఉపఎన్నిక పోలింగ్‌

11:00 October 30

మీడియా ప్రతినిధి డబ్బులు పంచుతున్నారని స్థానికుల ఆందోళన

  • జమ్మికుంట మండలం సాయింపేటలో ఉద్రిక్తత
  • మీడియా ప్రతినిధి డబ్బులు పంచుతున్నారని స్థానికుల ఆందోళన
  • డబ్బులు పంచుతున్నారని మీడియా ప్రతినిధిని అడ్డుకున్న గ్రామస్థులు

11:00 October 30

ఫ్రస్ట్రేషన్‌తోనే అడ్డుకుంటున్నారు: కౌశిక్‌రెడ్డి

  • నేను తెరాస చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా ఉన్నా: కౌశిక్‌రెడ్డి
  • 305 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంది: కౌశిక్‌రెడ్డి
  • భాజపా శ్రేణులు ఫ్రస్ట్రేషన్‌తోనే అడ్డుకుంటున్నారు: కౌశిక్‌రెడ్డి
  • నా వెనుక ఎవరూ తెరాస కార్యకర్తలు లేరు: కౌశిక్‌రెడ్డి

10:49 October 30

వీణవంకలోనూ కౌశిక్‌రెడ్డిని అడ్డుకున్న ఇతర పార్టీల కార్యకర్తలు

  • వీణవంకలోనూ కౌశిక్‌రెడ్డిని అడ్డుకున్న ఇతర పార్టీల కార్యకర్తలు
  • వీణవంక జడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రానికి వెళ్లిన కౌశిక్‌రెడ్డి
  • వీణవంకలో కౌశిక్‌రెడ్డిని అడ్డుకున్న ఇతర పార్టీల కార్యకర్తలు
  • స్థానికుల అభ్యంతరంతో కౌశిక్‌రెడ్డిని బయటకు పంపించిన పోలీసులు

10:48 October 30

తెరాస కౌన్సిలర్ ఇంట్లో డబ్బులు పంపిణీ..!

  • జమ్మికుంట 28వ వార్డులో భాజపా శ్రేణుల ఆందోళన
  • తెరాస కౌన్సిలర్ దీప్తి ఇంట్లో డబ్బులు పంచుతున్నారని నిరసన
  • తెరాస కౌన్సిలర్ దీప్తి ఇంటి ఎదుట భాజపా శ్రేణుల ఆందోళన
  • డబ్బులు స్వాధీనం చేసుకోవాలంటూ భాజపా శ్రేణుల ఆందోళన

10:34 October 30

తెరాస నేత కౌశిక్‌రెడ్డికి రక్షణగా నిలిచిన పోలీస్ సిబ్బంది

  • ఘన్ముక్లలో కౌశిక్‌రెడ్డిని నిలదీసిన భాజపా శ్రేణులు
  • ఘన్ముక్లకు మళ్లీ మళ్లీ ఎందుకు వస్తున్నారంటూ భాజపా శ్రేణుల ఆగ్రహం
  • కౌశిక్‌రెడ్డి దౌర్జన్యానికి యత్నిస్తున్నారంటూ భాజపా ఆరోపణ
  • చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌నంటూ ఐడీ కార్డు చూపిన కౌశిక్‌రెడ్డి
  • తెరాస నేత కౌశిక్‌రెడ్డికి రక్షణగా నిలిచిన పోలీస్ సిబ్బంది
  • భాజపా శ్రేణులకు సర్దిచెబుతున్న పోలీసులు
  • పోలీసులు సర్దిచెప్పడంతో పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన కౌశిక్‌రెడ్డి
  • ఘన్ముక్లలో పరిస్థితులను ఉన్నతాధికారులకు వివరించిన పోలీసులు
  • ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పరిస్థితిని కట్టడి చేస్తున్నాం: పోలీసులు

10:27 October 30

ఘన్ముక్లలో మరోసారి ఉద్రిక్తత

  • హుజూరాబాద్: ఘన్ముక్లలో మరోసారి ఉద్రిక్తత
  • తెరాస శ్రేణులతో కలిసి మరోసారి ఘన్ముక్లకు వచ్చిన కౌశిక్‌రెడ్డి
  • ఘన్ముక్లలో కౌశిక్‌రెడ్డిని నిలదీసిన భాజపా శ్రేణులు
  • ఘన్ముక్లకు మళ్లీ మళ్లీ ఎందుకు వస్తున్నారంటూ భాజపా శ్రేణుల ఆగ్రహం
  • కౌశిక్‌రెడ్డి దౌర్జన్యానికి యత్నిస్తున్నారంటూ భాజపా ఆరోపణ
  • చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌నంటూ ఐడీ కార్డు చూపిన కౌశిక్‌రెడ్డి
  • తెరాస నేత కౌశిక్‌రెడ్డికి రక్షణగా నిలిచిన పోలీస్ సిబ్బంది
  • చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా పోలింగ్ కేంద్రానికి వెళ్లాను: కౌశిక్‌రెడ్డి
  • ఈటల వర్గీయులు సానుభూతి కోసం యత్నిస్తున్నారు: కౌశిక్‌రెడ్డి
  • చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా వెళ్లేందుకు నాకు హక్కు ఉంది: కౌశిక్‌రెడ్డి

10:27 October 30

ఈటల వర్గీయులు సానుభూతి కోసం యత్నిస్తున్నారు

  • చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా పోలింగ్ కేంద్రానికి వెళ్లాను: కౌశిక్‌రెడ్డి
  • ఈటల వర్గీయులు సానుభూతి కోసం యత్నిస్తున్నారు: కౌశిక్‌రెడ్డి
  • చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా వెళ్లేందుకు నాకు హక్కు ఉంది: కౌశిక్‌రెడ్డి

10:16 October 30

పోలింగ్ కేంద్రాల సమీపంలో ప్రధాన పార్టీల కార్యకర్తల ప్రచారం

  • జమ్మికుంట మండలంలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
  • పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ కర్ణన్
  • ఉదయం మందకొడిగా తరలివచ్చిన ఓటర్లు
  • జమ్మికుంట మండలంలో క్రమంగా పెరుగుతున్న ఓటర్ల రద్దీ
  • పోలింగ్ కేంద్రాల సమీపంలో ప్రధాన పార్టీల కార్యకర్తల ప్రచారం

10:13 October 30

హుజూరాబాద్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

  • హుజూరాబాద్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
  • పోలింగ్ కేంద్రాల వద్ద పెద్దసంఖ్యలో బారులుతీరిన ఓటర్లు
  • హుజూరాబాద్‌లో ఓటేసిన వకుళాభరణం కృష్ణమోహన్
  • కాసేపట్లో హుజురాబాద్‌కు సీఈవో శశాంక్ గోయల్
  • హుజూరాబాద్‌లో పోలింగ్ సరళిని పరిశీలించనున్న శశాంక్ గోయల్

10:05 October 30

తెరాస శ్రేణులను అడ్డుకున్న భాజపా కార్యకర్తలు

  • వీణవంక మండలంలో చెదురుమదురు ఘటనల మధ్య పోలింగ్
  • కోర్కల్‌లో తెరాస శ్రేణులను అడ్డుకున్న భాజపా కార్యకర్తలు
  • భాజపా, తెరాస శ్రేణుల మధ్య ఘర్షణ, చెదరగొట్టిన పోలీసులు
  • ఘన్ముక్లలో తెరాస నేత కౌశిక్‌రెడ్డిని అడ్డుకున్న భాజపా శ్రేణులు
  • పోలింగ్‌ కేంద్రంలోకి ఎందుకు వచ్చారని ప్రశ్నించిన భాజపా నేతలు
  • కౌశిక్‌రెడ్డికి వ్యతిరేకంగా భాజపా కార్యకర్తల నినాదాలు
  • భాజపా అభ్యంతరంతో కౌశిక్‌రెడ్డిని పంపించిన పోలీసులు
  • ఘన్ముక్లలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట
  • వీణవంక మండలంలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరిన ఓటర్లు

10:04 October 30

పోలీస్ బందోబస్తు మధ్య ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

  • కమలాపూర్ మండలంలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
  • పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన భాజపా అభ్యర్థి ఈటల
  • పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్ వెంకట్
  • కమలాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఓటేసిన ఈటల దంపతులు
  • కమలాపూర్‌లో పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరిన ఓటర్లు
  • పోలీస్ బందోబస్తు మధ్య ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
  • వరంగల్ సీపీ తరుణ్ జోషి, డీసీపీ పుష్ప ఆధ్వర్యంలో బందోబస్తు
  • పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన హనుమకొండ కలెక్టర్

09:40 October 30

సర్పంచ్‌ను అడ్డుకున్న భాజపా శ్రేణులు

  • హుజూరాబాద్: రెడ్డిపల్లిలో పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
  • ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ కర్ణన్
  • హుజూరాబాద్: కోర్కల్‌లో సర్పంచ్‌ను అడ్డుకున్న భాజపా శ్రేణులు
  • పోలింగ్ కేంద్రం వద్ద సర్పంచ్ ప్రచారం చేస్తున్నారని భాజపా అభ్యంతరం
  • భాజపా, తెరాస వర్గాలను చెదరగొట్టిన పోలీసులు

09:34 October 30

కౌశిక్‌రెడ్డిని అడ్డుకున్న భాజపా శ్రేణులు

  • హుజూరాబాద్: తెరాస నేత కౌశిక్‌రెడ్డిని అడ్డుకున్న భాజపా శ్రేణులు
  • ఘన్ముక్లలో కౌశిక్‌రెడ్డిని అడ్డుకున్న భాజపా శ్రేణులు
  • ఘన్ముక్లలో పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన కౌశిక్‌రెడ్డి
  • స్థానికేతరులు ఎందుకు వచ్చారని కౌశిక్‌రెడ్డిని నిలదీసిన భాజపా శ్రేణులు

09:18 October 30

'ఈసీ కూడా డబ్బు పంపిణీని అడ్డుకోలేకపోతోంది'

  • అధికార పార్టీ మద్యం ఏరులై పారిస్తోంది: ఈటల రాజేందర్
  • మాకు డబ్బులు ఇవ్వలేదని ఓటర్లే ఆందోళన చేసే పరిస్థితి: ఈటల
  • పోలింగ్ రోజు కూడా డబ్బులు పంచుతున్నారు: ఈటల రాజేందర్
  • ఈసీ కూడా డబ్బు పంపిణీని అడ్డుకోలేకపోతోంది: ఈటల
  • మంచి చెడు ఆలోచించుకునే సత్తా ప్రజలకు ఉంది: ఈటల

09:12 October 30

కమలాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఈటల రాజేందర్

  • కమలాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఈటల రాజేందర్
  • కమలాపూర్‌లోని పోలింగ్ కేంద్రం 262లో ఓటేసిన ఈటల రాజేందర్

09:09 October 30

కొనసాగుతున్న హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్‌

  • ఉదయం 9 గంటల వరకు 10.50 శాతం పోలింగ్ నమోదు
  • రాత్రి 7 గంటల వరకు కొనసాగనున్న ఉపఎన్నిక పోలింగ్‌
  • హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న సీఈవో
  • బుద్ధభవన్ నుంచి పర్యవేక్షిస్తున్న సీఈవో శశాంక్ గోయల్
  • వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న సీఈవో

09:00 October 30

తెరాస నేతను అడ్డుకున్న స్థానికులు

  • హుజూరాబాద్: శ్రీరాములపల్లిలో తెరాస నేతను అడ్డుకున్న స్థానికులు
  • గజ్వేల్ మార్కెట్ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్‌ను అడ్డుకున్న స్థానికులు
  • స్థానికేతరులు ఎందుకు వచ్చారని ప్రశ్నించిన స్థానికులు
  • స్థానికుల అభ్యంతరంతో వెళ్లిపోయిన తెరాస నేత మాదాసు శ్రీనివాస్

08:59 October 30

వీణవంకలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ కర్ణన్

  • వీణవంకలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ కర్ణన్
  • కమలాపూర్‌లో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్

08:44 October 30

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఈటల

  • హుజూరాబాద్: కందుగులలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఈటల
  • కందుగుల జడ్పీ పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఈటల
  • ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి: ఈటల రాజేందర్


 

08:02 October 30

ఉప్పల్‌లో ఈవీఎం మొరాయింపు

  • కమలాపూర్‌ మండలం ఉప్పల్‌లో ఈవీఎం మొరాయింపు
  • పోలింగ్‌ నెం.295లో ఈవీఎంకు మరమ్మతు చేసిన అధికారులు
  • ఈవీఎం మొరాయింపుతో ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్

07:12 October 30

బరిలో 30 మంది అభ్యర్థులు

  • హుజూరాబాద్ ఉపఎన్నికల బరిలో 30 మంది అభ్యర్థులు
  • హుజూరాబాద్ ఉపఎన్నిక బరిలో భాజపా అభ్యర్థిగా ఈటల రాజేందర్
  • హుజూరాబాద్ ఉపఎన్నిక బరిలో తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌
  • హుజూరాబాద్ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బల్మూర్ వెంకట్

06:53 October 30

హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభం

  • హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభం
  • ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్
  • హుజూరాబాద్‌లో మెుత్తం 2,37,022 మంది ఓటర్లు
  • హుజూరాబాద్‌లో పురుష ఓటర్లు 1,18,720 మంది
  • హుజూరాబాద్‌లో మహిళా ఓటర్లు 1,17,563 మంది
  • హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 5 మండలాల్లో పోలింగ్‌
  • హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో పోలింగ్
  • వీణవంక, కమలాపూర్‌ మండలాల్లో పోలింగ్‌
  • హజూరాబాద్ పరిధిలో మెుత్తం 106 పంచాయతీల్లో పోలింగ్
  • హుజూరాబాద్ నియోజకవర్గంలో 306 కేంద్రాల్లో పోలింగ్
  • హుజూరాబాద్ ఉపఎన్నిక బరిలో 30 మంది అభ్యర్థులు
  • నవంబరు 2న హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

06:18 October 30

ఎన్నికకు అంతరాయం లేకుండా ఏర్పాట్లు

  • పోలింగ్‌కు అంతరాయం లేకుండా విద్యుత్‌తో పాటు సోలార్‌ దీపాలు ఏర్పాటు
  • పోలింగ్‌ విధుల్లో పాల్గొననున్న 1715 మంది సిబ్బంది
  • 306 కేంద్రాల్లో 107 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు గుర్తింపు
  • సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక పోలీస్‌ బందోబస్తు
  • మొత్తం 3,865 మంది పోలీసులతో బందోబస్తు
  • బందోబస్తులో 20 కంపెనీల కేంద్ర బలగాలు, 74 మంది ప్రత్యేక పోలీసులు
  • 700 మంది కరీంనగర్‌ జిల్లా పోలీసులు, 1,471 మంది ఇతర జిల్లాల పోలీసులతో బందోబస్తు

06:11 October 30

నేడే హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌

  • నేడు హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌
  • ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్
  • హుజూరాబాద్‌లో మెుత్తం ఓటర్ల సంఖ్య: 2,37,022
  • హుజూరాబాద్‌లో మెుత్తం పురుష ఓటర్లు: 1,18,720 
  • హుజూరాబాద్‌లో మెుత్తం మహిళా ఓటర్లు: 1,17,563
  • హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 5 మండలాల్లో పోలింగ్‌
  • హుజూరాబాద్, వీణవంక, కమలాపూర్‌ మండలాల్లో పోలింగ్‌ జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో జరగనున్న పోలింగ్‌
  • మెుత్తం 106 గ్రామపంచాయతీల్లో జరగనున్న పోలింగ్‌
  • హుజూరాబాద్‌: మెుత్తం 306 కేంద్రాల్లో ఉపఎన్నిక పోలింగ్‌
  • హుజూరాబాద్ ఉపఎన్నిక బరిలో 30 మంది అభ్యర్థులు
  • నవంబర్‌ 2న హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
Last Updated : Oct 30, 2021, 9:49 PM IST

ABOUT THE AUTHOR

...view details