హుజూరాబాద్ ఉప ఎన్నికల నామపత్రాల పరిశీలన కార్యక్రమాన్ని... రిటర్నింగ్ అధికారి పూర్తి చేశారు (huzurabad by election nominations). మొత్తం 61 మంది అభ్యర్థులు 92 నామపత్రాలను దాఖలు చేశారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రవీందర్‌రెడ్డి... అభ్యర్థులు దాఖలు చేసిన నామపత్రాలు ఒక్కొక్కటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 19 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 23 నామపత్రాలు తిరస్కరణకు గురైనట్లు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. ఉప ఎన్నికల బరిలో 42 మంది ఉన్నట్లు ప్రకటించారు. ఈ నెల 13న నామపత్రాల ఉప సంహరణ కార్యక్రమం ఉంటుందన్నారు. అదే రోజు చివరి జాబితాను ప్రకటిస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి (election returning officer) స్పష్టం చేశారు.
ఈసారి గెల్లు శ్రీనివాస్‌కు అవకాశం ఇవ్వండి..
దసరా నవరాత్రుల వేళ.. ఉపఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది (huzurabad by election). హుజూరాబాద్ నుంచి ఇప్పటి వరకు 6 పర్యాయాలు ఈటల రాజేందర్‌ను గెలిపించారని.. ఈ ఒక్కసారి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు (gellu Srinivas yadav) అవకాశం ఇవ్వాలని.. మంత్రి హరీశ్‌రావు ( harish rao) పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని కనగర్తిలో జరిగిన ధూంధాంలో మంత్రి పాల్గొన్నారు. అంతకుముందు కరీంనగర్ - హనుమకొండ జిల్లాల సరిహద్దులోని పెంచికలపేటలో ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్... సన్మాన సభకు మంత్రి హాజరయ్యారు. తప్పుడు ప్రచారంతో ఈటల (etela rajender) సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారని.. మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఈటల చెప్పే ఝూటా మాటలు నమ్మి.. భాజపాకు ఓటు వేయవద్దని మంత్రి కోరారు.
వాళ్లిచ్చినవి తీసుకోండి.. ఓటు మాకే వేయండి