కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామంలో సంగం లక్ష్మీ (75) జీవనం సాగిస్తుంది. లక్ష్మీ భర్త రెండేళ్ల క్రితం మరణించాడు. కన్న పిల్లలు లేక.. వ్యవసాయం చేసుకునేందుకు భూమి లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంది.
వృద్ధురాలి పింఛన్ మంజూరుపై హెచ్‌ఆర్సీ సుమోటోగా విచారణ - హెచ్‌ఆర్సీ సుమోటో విచారణ వార్తలు
'పిల్లలు లేరు.. పింఛన్ వస్తలేదు' అంటూ వివిధ దిన పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణ స్వీకరించింది. కరీంనగర్ జిల్లా రాంపూర్‌కు చెందిన సంగం లక్ష్మీకి ఎన్ని సార్లు వృద్ధాప్య పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్న మంజూరు కాలేదు. ఈ ఘటనపై స్పందించిన హెచ్‌ఆర్సీ.. విచారణ జరపాలని ఆదేశించింది.
వృద్ధురాలి పింఛన్ మంజూరుపై హెచ్‌ఆర్సీ సుమోటోగా విచారణ
ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛన్ కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్న మంజూరు కాలేదు. బతుకు భారమైన.. జీవనం సాగిస్తున్న ఆ వృద్ధురాలి ఘటనపై హెచ్‌ఆర్సీ స్పందించింది. ఈ విషయంపై విచారణ జరిపి.. నవంబర్ 13లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంకకు ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి:కాలుష్య కారక పరిశ్రమలపై హెచ్‌ఆర్సీ సీరియస్.. సుమోటోగా కేసు స్వీకరణ