కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని ఆయుర్వేద ఆసుపత్రిలో ఆయుష్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ రవి నాయక్ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నెలరోజుల నుంచి వైద్యుడు, సిబ్బంది అందుబాటులో లేకపోవటం వల్ల ఆస్పత్రి అపరిశుభ్రంగా తయారైంది. సంబంధిత రికార్డులు పరిశీలించగా... నిర్వీర్యంగా దర్శనమిచ్చాయి.
వైద్యుడు రావట్లేదని ఆయుర్వేద ఆస్పత్రి సీజ్ - ganneruvaram latest news
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని ఆయుర్వేద ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. నెల రోజులుగా ఆస్పత్రికి వైద్యుడు రావట్లేదని స్థానికులిచ్చిన ఫిర్యాదు మేరకు రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి... బాధ్యాతారహితంగా ప్రవర్తించిన వైద్యునికి నోటీసులు జారీ చేశారు.
వైద్యుడు రావట్లేదని ఆయుర్వేద ఆస్పత్రి సీజ్
అను నిత్యం అందుబాటులో ఉండి... వైద్య సేవలందించాల్సిన వైద్యుడు అందుబాటులో లేక ఇబ్బందులు పడిన స్థానికులు... పలుమార్లు సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా... ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ డైరెక్టర్... డాక్టర్ మధుసూదన్ వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ సరళిపై నోటీసులు జారీ చేస్తూ... కన్వీనర్‌కు అందజేస్తామని తెలిపారు. అనంతరం ఆసుపత్రిని సీజ్ చేశారు.