కరోనా వైరస్ ఆందోళన కారణంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు హోళీకి దూరంగా ఉన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సహజసిద్దమైన రంగులతో ఆనందోత్సవాల మధ్య హోళీ జరుపుకున్నారు. కలెక్టర్ కె.శశాంకతోపాటు అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్, పలువురు ఉద్యోగులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
కుమారుడితో హోళీ ఆడి కలెక్టర్ శశాంక సందడి - కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక
కరీంనగర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సహజసిద్ధ రంగులతో హోళీ జరుపుకున్నారు. ఈ వేడుకలకు కలెక్టర్ కె.శశాంకతోపాటు అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్, పలువురు ఉద్యోగులు హాజరయ్యారు.
![కుమారుడితో హోళీ ఆడి కలెక్టర్ శశాంక సందడి](https://etvbharatimages.akamaized.net/breaking/breaking_1200.png)
Breaking News
హోళీ సందర్భంగా కలెక్టర్ శశాంక తన కుమారునిపై రంగులు చల్లడం ఆకర్షణీయంగా నిలిచింది. మరోవైపు ఆహ్లాదకరమైన సంగీతం వింటూ ఉద్యోగులు నృత్యాలు చేశారు. పండుగ సందర్భంగా కలెక్టర్ శశాంక ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
సహజసిద్ధ రంగులతో హోళీ ఆడిన కలెక్టర్
ఇదీ చూడండి :తుపాకీతో కాల్చుకొని ఆసుపత్రి ఎండీ ఆత్మహత్య
TAGGED:
సహజసిద్ధ రంగులతో హోళీ