విజయవంతమైన ఏక్తా యాత్ర - mp
భారతీయులందరూ ఒకటే.. హిందుత్వం అంటే మతం కాదు దేశభక్తి.. ధర్మం.. ధైర్యం.. తపస్సు.. తేజస్సు.. అంటూ కరీంనగర్ హిందూ ఏక్తా యాత్ర నిర్వహించారు.
ఏక్తా యాత్ర
ఏటా నిర్వహించే ఏక్తాయాత్రను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. పట్టణంలోని వైశ్య భవన్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో సంజయ్‌తో పాటు స్వామీజీ సిద్దేశ్వర నందగిరి దత్త పీఠాధిపతి పాల్గొన్నారు. ప్రదర్శనలో శ్రీరాముని, హనుమాన్ ప్రతిమలు ఆకట్టుకున్నాయి. కాషాయ జెండాలతో వీధులన్నీ కళకళలాడాయి. జై శ్రీరామ్ నినాదాలు మార్మోగాయి. ప్రధాన ఆలయం వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఏర్పాట్లను సీపీ కమలాసన్‌రెడ్డి పర్యవేక్షించారు.