Herbal Panipuri Shop in Karimnagar: కరోనా తర్వాత ప్రతి ఒక్కరిలో ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగింది. ఏ ఆహారం తీసుకున్నా అది తమ ఆరోగ్యానికి ఎంతమేరకు ఉపయోగకరం అనే విషయాన్ని బేరీజు వేసుకుంటున్నారు. సాయంత్రం సమయాన బయటకి వచ్చినప్పుడు పానీపూరీ ఛాట్ బండార్ కనిపిస్తే తినకుండా ఉండలేం. ఈ సంగతి తెలిసిన కొప్పుల పూర్ణిమకు కొత్త ఆలోచన వచ్చింది. తను చదివినా ఎంఫార్మసీ.. పానీపూరి షాప్‌కు ఎలా వినియోగించుకోవాలో ఆలోచించి. దీంతో వినూత్నంగా హెర్బల్ పానీపూరీని అందుబాటులోకి తీసుకొచ్చింది. తాను ప్రారంభించిన వ్యాపారానికి అనూహ్య స్పందన లభిస్తుండటంతో విస్తరించే దిశగా అడుగులేస్తోంది.
MPharmacy- Panipuri Valley Shop in Karimnagar: ఎంత చదువు చదివినా.. ఆత్మ సంతృప్తి లేని ఉద్యోగం చేయబోనని చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి. కరీంనగర్‌కి చెందిన కొప్పుల పూర్ణిమ మాత్రం ఆత్మసంతృప్తి కోసం తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలివేసింది. ఎంఫార్మసీ(MPharmacy Student Panipuri Shop) చదివినా తనకు నచ్చిన విధంగా హెర్బల్ పానీపూరీ బంఢార్ ఏర్పాటు చేయాలని అనుకుంది. ఉన్నత చదువులు చదివామని గొప్పలకు పోకుండా పానీపూరీ అమ్మేస్తూ శభాష్ అనిపించుకుంటోంది. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి కరీంనగర్‌లో ‘ఎంఫార్మసీ- పానీపూరీ వాలీ’ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించింది.
IAS కావాలనుకొని 'BTech పానీపూరివాలా'గా- యువతి సక్సెస్ స్టోరీ అదుర్స్
"నేను స్సూల్స్లో పని చేశాను. అంత సంతృప్తి కలగలేదు. నాకు బిజినేస్ పెట్టాలని అనుకున్నాను. ఎక్కువ మంది ఇష్టపడేది పానీపూరి. ఆరోగ్యానికి మంచిగా ఉండే పానీపూరి తయారు చేయాలని అనుకుని ఈ షాపు పెట్టాను. హోంమేడ్ మసాలాతో తయారు చేస్తున్నాను. కస్టమర్స్ నుంచి మంచి స్పందన వస్తుంది. త్వరలోనే మరో బ్రాంచ్ పెడదామని అనుకుంటున్నాను." - కొప్పుల పూర్ణిమ,ఎంఫార్మసీ విద్యార్ధిని,కరీంనగర్
Young Women Panipuri Shop in Karimnagar Story : కొంతమంది పూర్ణిమ పెట్టిన పానీపూరి షాప్(Panipuri Shop in Karimnagar) చూసి.. ఇంత చదువూ చదివి పానీపూరీలు అమ్ముతున్నావా అంటూ తక్కువ చేసి మాట్లాడినా.. తను మాత్రం కుంగిపోలేదు. ఎడారిలో కూడా పూలూ పూయించొచ్చనేది తన అభిప్రాయం అంటూ పూర్ణిమ ముందుకు సాగుతోంది. ఇరుగుపొరుగు మాటలను పట్టించుకోకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. కరీంనగర్‌లో ఓ ప్రైవేటు పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. కొన్నాళ్లు మెడికల్ షాపూ నిర్వహించింది. అవేవీ తనకు సంతోషాన్నివ్వలేదు.