తెలంగాణ

telangana

ETV Bharat / state

KALESHWARAM: నిరాటంకంగా కొనసాగుతున్న గోదావరి జలాల ఎత్తిపోతలు - telangana varthalu

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలు ఐదు రోజులుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఎస్సారెస్పీ(srsp), ఎల్‌ఎండీ(lower manair dam), మధ్యమానేరు జలాశయాల ఆయకట్టు పరిధిలోని చెరువులు, కుంటలను నింపాలనే లక్ష్యంతో జలాల తరలింపు జరుగుతోంది.

KALESHWARAM
నిరాటంకంగా కొనసాగుతున్న గోదావరి జలాల ఎత్తిపోతలు

By

Published : Jun 20, 2021, 8:49 PM IST

నిరాటంకంగా కొనసాగుతున్న గోదావరి జలాల ఎత్తిపోతలు

ఎగువ నుంచి నీటి ప్రవాహం వస్తుండటంతో కాళేశ్వరం బ్యారేజీల్లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. వరద పెరగడం వల్ల రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోస్తున్నారు. గోదావరి జలాల ఎత్తిపోతలు ఐదు రోజులుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీ, మధ్యమానేరు జలాశయాల ఆయకట్టు పరిధిలోని చెరువులు, కుంటలను నింపాలనే లక్ష్యంతో జలాల తరలింపు చేపట్టారు. నంది పంపుహౌస్‌లోని నీటిని ఎత్తిపోసే మోటార్ల సంఖ్యను నాలుగుకు పెంచి ఎత్తిపోతలు నిరాటంకంగా కొనసాగించారు.

దిగువ మానేరుకు జలాలు..

ఎల్లంపల్లి జలాశయం నుంచి 12,600 క్యూసెక్కుల జలాలు నందిమేడారం రిజర్వాయరులోకి చేరుతున్నాయి. అంతే ప్రవాహాన్ని గాయత్రి పంపుహౌస్‌కు వదులుతున్నారు. గాయత్రి పంపు నుంచి మధ్య మానేరుకు నీటిని తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. కాళేశ్వర ఎత్తిపోతల పథకంలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్​గా ఉన్న మాధ్యమానేరుతో పాటు దిగువమానేరు జలాశయానికి నీటిని చేరవేస్తున్నారు. మధ్యమానేరు నుంచి 9గేట్లు స్లూయిజ్ గేట్ల ద్వారా ఎల్​ఎండీకి నీటిని తరలిస్తున్నారు.

ఇదీ చదవండి:కాళేశ్వర ఫలితం.. నిండుకుండలా ప్రాజెక్టులు

ABOUT THE AUTHOR

...view details