శ్రావణ శనివారం సందర్భంగా కరీంనగర్లో శ్రీ వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. పంచామృతాలతో భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేశారు. గోవింద నామస్మరణతో ఆలయం మారుమోగింది.
వైష్ణవాలయాలకు పోటెత్తిన భక్తులు