చేనేత కార్మికులను ఓట్లడిగే నైతిక హక్కు భాజపాకు లేదని మంత్రి తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ తెరాస పార్టీ కార్యాలయంలో పలువురు యువకులు తెరాసలో చేరారు. కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి ఆహ్వానించారు. ఆలిండియా హ్యాండ్‌లూమ్ బోర్డును రద్దు చేసింది భాజపాయేనని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. చేనేత కార్మికుల కోసం నేతన్న చేయూతనిచ్చింది తెరాస పార్టీయేనని స్పష్టం చేశారు. అన్ని రద్దు చేసుకుంటూ పోతున్న భాజపాను హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad by election 2021)లో కూడ రద్దు చేయాలని నేత కార్మికులకు మంత్రి సూచించారు.
'అసలు భాజపాకు ఓటేందుకు వేయాలో ఒక్క కారణం చెప్పండి' ప్రజలంతా తెరాసవైపే..
"నేత కార్మికులు భాజపాకు ఓటెందుకు వేయాలో ఆ పార్టీ నేతలు సూటిగా సమాధానం చెప్పాలి. ఏడేళ్లలో చేనేత కార్మికుల కడుపు నింపే ప్రయత్నం కేంద్రం ఏం చేసింది. నేతన్నల కోసం ఏ ఒక్క కొత్త పథకాన్నైనా ప్రవేశపెట్టిందా. నేత కార్మికులకు రక్షణ ఇచ్చింది తెరాస ప్రభుత్వమే. ఉపఎన్నికల ప్రచారానికై రోజుకో కేంద్ర మంత్రి ఇక్కడికి వస్తున్నారు. వారందరికీ స్వాగతమే కానీ.. రద్దు చేసిన పథకానికి ప్రత్యామ్నాయంగా నేత కార్మికులకు ఏం చేస్తారో చెప్పి వెళ్లండి. రానున్న ఉప ఎన్నికల్లో నేత కార్మికులు, ఇతర వర్గాల ప్రజలు తెరాసవైపే ఉన్నారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ భారీ మెజార్టీతో గెలుస్తారు." -హరీశ్‌రావు, మంత్రి
ఇదీ చూడండి: