హుజూరాబాద్ ప్రస్తుతం (huzurabad bypoll campaign news)జరుగుతున్న ఉపఎన్నికలో ఏ పార్టీకి ఓటు వేస్తే మనకు లాభమో ఆలోచించాలని కరీంనగర్ జిల్లా వీణవంక ప్రజలకు మంత్రి హరీశ్‌రావు సూచించారు. మనకు అన్నం పెట్టిన వాళ్లు ఎవరో.. నష్టం చేసే వాళ్లెవరో ఆలోచించి ఓటు హక్కును వినియోగించాలని కోరారు. వీణవంకలో జరిగిన ధూంధాంలో కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
కొందరు సెంటిమెంట్ మాటలతో ఓట్లు పొందాలని చూస్తున్నారని చెప్పిన హరీశ్.. పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రజలను కోరారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో తెరాస, భాజపాలు రెండు మాత్రమే పోటీలో ఉన్నాయన్నారు. ముద్దసాని దామోదర్‌రెడ్డి మీద పోటీకి 2004లో ఈటల రాజేందర్‌కు టికెట్ ఇచ్చినప్పుడు... గులాబీ కండువా, కారు గుర్తును చూసిమాత్రమే ఓటు వేసి గెలిపించారని హరీశ్ అన్నారు. కానీ ఈటల రాజేందర్ మాత్రం తనను చూసే ప్రజలు ఓట్లేసినట్లు చెబుతున్నారని హరీశ్ మండిపడ్డారు.
ఈటల రాజేందర్‌ను.. కేసీఆర్ పెంచి పెద్ద చేస్తే.. ఈటల మాత్రం కేసీఆర్‌కు ఘోరీ కడతా అంటున్నారని.. ఇది న్యాయమేనే.. ఇలా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు.. హరీశ్‌రావు.