తెలంగాణ

telangana

ETV Bharat / state

Kondagattu Hanuman Jayanti celebrations : కొండగట్టులో నేటి నుంచి పెద్దహనుమాన్ జయంతి ఉత్సవాలు - Pedda Hanuman Jayanti celebrations in Kondagattu

Pedda Hanuman Jayanti celebrations in Kondagattu : ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ​పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు సిద్దమైంది. ఇవాళ్టి నుంచి ఆదివారం వరకు జరిగే ఈ వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం యాగశాలలో అంకుర్పాణ కార్యక్రమం నిర్వహించారు. మరోవైపు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని రకాల వసతులు కల్పించారు.

Kondagattu
Kondagattu

By

Published : May 12, 2023, 9:22 AM IST

Pedda Hanuman Jayanti celebrations in Kondagattu : హనుమాన్​ పెద్ద జయంతి ఉత్సవాలకు కొండగట్టు అంజన్న స్వామి దేవాలయం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి ఈనెల 14వ తేదీ వరకు మూడు రోజులు జరిగే ఈ ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలోని యాగశాలలో గురువారం అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పరిశీలించారు.

పెద్ద హనుమాన్‌ జయంతి ఉత్సవాలకు సుమారు 2 లక్షల మంది దీక్షాపరులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేశారు. కొండగట్టు పరిసరాల్లో 55 తాత్కాలిక, 64 శాశ్వత మరుగుదొడ్లను సిద్ధం చేసినట్లు ఈవో వెంకటేశ్‌, ఏఈవో బుద్ది శ్రీనివాస్‌, ఏఈ లక్ష్మణ్‌రావు తెలిపారు. 1500 నాయీబ్రాహ్మణులను ఏర్పాటు చేశారు. కొండగట్టు దిగువ, పైన ఏడు ప్రాంతాల్ల వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థాలాన్ని ఏర్పాటు చేశారు.

భక్తులకు తాగు నీరు అందించేందుకు 5 సంచార ఆటోలు, 28 చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. కొత్త కోనేరులో ఎప్పటికప్పుడు నీళ్లను నింపడంతోపాటు 120 షవర్లు పెట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కొండపై సెల్​ఫోన్​ సిగ్నల్​కు అంతరాయం ఏర్పడకుండా జియోతోపాటు 4 రోజులపాటు తాత్కాలికంగా ఎయిర్‌టెల్‌ సేవలు అందించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్వామి వారి ప్రసాదం విక్రయానికి 12 కౌంటర్లు ఏర్పాటు చేయడంతోపాటు టిక్కెట్ల రీఇష్యూ, అక్రమ వసూళ్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఆలయ ఈవో వెంకటేశ్​ పేర్కొన్నారు.

Kondagattu Anjanna Festivals : రాత్రి వేళల్లో కొండగట్టుకు వచ్చే దీక్షాపరులు ప్రమాదాల బారిన పడకుండా వారి బ్యాగులకు, వెనుకవైపు దుస్తులకు రేడియం స్టిక్కర్లు అంటించనున్నారు. దూరం నుంచే వారిని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. భక్తులు మార్గమధ్యలో సేదతీరడానికి ప్రధాన రహదారి పక్కన పలుచోట్ల తడికల పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఉచిత అన్నదానం ఏర్పాటు.. ఆలయ ప్రాంగణంలో నిత్యం సాంస్కృతి కార్యక్రమాలు జరిగేలా 16 బృందాలను ఏర్పాటు చేశారు.

భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1.కొండగట్టు అంజన్న దర్శనం కోసం వచ్చే దీక్షాపరులు, భక్తులు తమ వాహనాలను నిర్ణీత పార్కింగ్‌ ప్రదేశాల్లో నిలిపి కాలినడకన ఆలయానికి చేరుకోవాలి.

2. కొండపైకి పోలీసులు ఎలాంటి వాహనాలను అనుమతించరు.

3. వాతావరణ పరిస్థితులు ఎండ తీవ్రత కారణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పాదయాత్రతో కొండపైకి చేరుకోవడం చాలా మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

4. జగిత్యాల ప్రధాన రహదారి నుంచి వచ్చే భక్తులు ఘాట్‌రోడ్డు మీదుగా లేదా మెట్లదారిలో కరీంనగర్‌వైపు నుంచి వచ్చే వారు జేఎన్టీయూ కళాశాల మీదుగా ఆలయానికి చేరుకోవాలి.

5. జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు అధికారులు విధులు నిర్వర్తిస్తారు.

6. జిల్లా ఎస్పీ నేతృత్వంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు వారికి సహకరించాలి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details