కరోనా విజృంభణ నానాటికీ పెరుగుతున్న తరుణంలో అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించండి అని ఓ దివ్యాంగుడు విజ్ఞప్తి చేస్తున్నారు. కరీంనగర్ నగరంలోని కట్ట రాంపూర్‌లో నివాసముంటున్న అరుణ్ కుమార్ చిన్నతనంలోనే ప్రమాదవశాత్తు రెండు చేతులను కోల్పోయారు. అయినా ఏమాత్రం అధైర్యపడకుండా రెండు కాళ్ల సాయంతో తన పనులు తాను చేసుకుంటూ పట్టభద్రుడయ్యారు.
అందరూ మాస్కులు ధరించండి.. ఓ దివ్యాంగుడి విజ్ఞప్తి - తెలంగాణ వార్తలు
కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అందరూ మాస్కు ధరించాలని ఓ దివ్యాంగుడు కోరుతున్నారు. వైరస్ కట్టడికి అందరూ తమ వంతు బాధ్యత వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రెండు చేతులనూ పోగొట్టుకున్న ఆత్మస్థైర్యంతో డిగ్రీ పూర్తి చేసి కుటుంబానికి తనవంతు సాయం చేస్తున్నారు.
దివ్యాంగుడి మాస్క్ విజ్ఞప్తి, కరీంనగర్ దివ్యాంగుడి విజ్ఞప్తి
పాఠశాలలో విద్యా వాలంటీర్‌గా పని చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నారు. కరోనా సమయంలో ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ ద్వారా పనిచేసి రూ.10 వేలను సంపాదిస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. వైరస్‌ను అరికట్టడానికి అందరూ సహకరించాలని కోరుతున్నారు.