కూలీ రేటు పెంచాలని కోరుతూ జిల్లా ఆల్ మండల్ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట హమాలీ కార్మికులు ధర్నా చేపట్టారు. ఐకేపీ, ప్యాక్స్‌లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు ఒకే రేటు 45 రూపాయలు ఇవ్వాలని కోరారు.
కూలీ రేటు పెంచాలని హమాలీ కార్మికుల ధర్నా.. - కరీంనగర్ వార్తలు
కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆల్ మండల్ హమాలీ యూనియన్ అధ్వర్యంలో హమాలీ కార్మికులు ధర్నా చేపట్టారు. హమాలీ కూలీ రేటు పెంచాలని వారు డిమాండ్ చేశారు.

కరీంనగర్లో హమాలీ కార్మికుల ధర్నా
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి, తాడికల్‌లో స్థానిక హమాలీలను కాదని ఇతర రాష్ట్రాల కార్మికులను పనిలోకి తీసుకుంటున్నారని.. దీన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి రమేష్, కార్మికులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: సురక్షితంగా రోడ్డు దాటేలా ఆకాశ మార్గాలు..