తెలంగాణ

telangana

ETV Bharat / state

త్వరలోనే మధ్యమానేరుకు నీటిని తరలిస్తాం: మంత్రి ఈటల - eetala rajendar

73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కరీంనగర్‌ జిల్లాలో ఘనంగా జరిగాయి. జిల్లా పోలీసు కవాతు మైదానంలో జరిగిన ఈ వేడుకల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు.

పోలీసు కవాతు మధ్య మంత్రి ఈటల

By

Published : Aug 15, 2019, 8:39 PM IST

కరీంనగర్‌ జిల్లా పోలీసు కవాతు మైదానంలో వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్‌ జాతీయ జెండా ఎగరవేసి... పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.కాళేశ్వరం జలాలు అందించి రైతులకు కరవు అంటే ఏంటో తెలియకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. ప్రాజెక్టు పనులన్నీ దాదాపు పూర్తి అయ్యాయని..త్వరలోనే సీఎం కేేసీఆర్​ చేతుల మీదుగా మోటార్లు ప్రారంభింప చేసి మధ్యమానేరుకు నీటిని తరలిస్తామని పేర్కొన్నారు. అంతే కాకుండా అన్నిరంగాల్లో అభివృద్ధిని సాధించి జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలోకి తీసుకు రావాలన్నదే తమ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయుధాలకు సంబంధించిన స్టాళ్లను మంత్రి ఆసక్తిగా పరిశీలించారు. ఆయుధాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కడక్‌నాథ్ కోళ్లకు సంబంధించిన స్టాల్‌ను తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

త్వరలోనే మధ్యమానేరుకు నీటిని తరలిస్తాం: మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details