కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో ప్రమాదవశాత్తుగా గడ్డివాములు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలాలను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
గడ్డివాములు దగ్ధం... ఎమ్మెల్యే పరామర్శ - Grasshoppers Fire at Ganneruvaram in Karimnagar District
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో ప్రమాదవశాత్తుగా గడ్డివాములు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలాలను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరిశీలించారు. ఈ ఘటనలో రైతులకు రూ.2లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. నష్టపోయిన అన్నదాతలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
గడ్డివాములు దగ్ధం
విద్యుత్ తీగల రాపిడితో మెరుగులు వెదజల్లి మంటలు వ్యాపించాయని ఎమ్మెల్యేకు రైతులు వివరించారు. అనంతరం ఉపాధిహామీ కూలీల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పని సమయంలో కూలీలకు కల్పిస్తున్న భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు.