కరీంనగర్ కలెక్టరేట్ ముందు సీఐటీయు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాల చట్టం అమలు చేస్తామని చెప్పి 11 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అమలు చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కార్మికులు సమ్మె చేసినప్పుడు కార్మికులకు కనీస వేతనంగా 8500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇంతవరకూ నెరవేర్చలేదని వాపోయారు. ఎన్నో ఏళ్లుగా కార్యదర్శులుగా విధులు నిర్వర్తిస్తున్న అర్హులకు కూడా ఇంతవరకు ఎలాంటి ప్రమోషన్లు ఇవ్వలేదని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
కలెక్టరేట్ ముందు గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా - DHARNA
గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాల చట్టం అమలు చేస్తామని చెప్పి 11 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అమలు చేయకపోయలేదని కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టరేట్ ముందు గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా