కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి నది జలాల ఎత్తిపోతలు మొదలయ్యాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గాయత్రి పంప్ హౌజ్ నుంచి సుమారు 3300 క్యూసెక్కుల జలాలు ఎత్తిపోస్తున్నారు. మూడు భారీ పంపులతో ఎత్తిపోతలు చేపట్టి ఇక్కడి నుంచి ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా మధ్యమానేరు ప్రాజెక్టుకు తరలిస్తున్నారు.
మూడు భారీ పంపులతో గోదావరి జలాల ఎత్తిపోత - గోదావరి జలాల ఎత్తిపోతల తాజా వార్తలు
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గాయత్రి పంప్ హౌజ్ నుంచి సుమారు 3300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. 3 భారీ పంపులతో ఎత్తిపోతలు చేపట్టి గాయత్రి పంప్ హౌజ్ నుంచి ఎస్సారెస్పీ కాలువ ద్వారా మధ్యమానేరు ప్రాజెక్టుకు తరలిస్తున్నారు. నిత్యం రెండు టీఎంసీల జలాలు తరలించేందుకు గాయత్రి పంప్ హౌజ్ వద్ద భారీ పంపులను వరుసగా మొదలుపెడుతున్నారు.
మూడు భారీ పంపులతో గోదావరి నది జలాల ఎత్తిపోతలు
ఐదు టీఎంసీల కనిష్ఠ నిలువకు చేరుకున్న మధ్యమానేరు ప్రాజెక్టును నీటితో నింపేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. నిత్యం రెండు టీఎంసీల జలాలు తరలించేందుకు గాయత్రి పంప్ హౌజ్ వద్ద భారీ పంపులను వరుసగా మొదలుపెడుతున్నారు.
ఇదీ చదవండి:రాష్ట్ర కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే!