కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంపుహౌస్ నుంచి గోదావరి జలాల ఎత్తిపోతలు రెండు దిశల్లో ప్రవహిస్తున్నాయి. ఈనెల 10న మొదలైన ఎత్తిపోతలు ఇప్పటి వరకు గాయత్రి పంపుహౌస్ నుంచి నేరుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరదకాలువ నుంచి మధ్యమానేరు జలాశయంలోకి తరలించారు.
'గాయత్రి పంప్‌హౌస్‌లో మరోసారి జలహోరు' - గాయత్రి పంప్‌హౌస్ వార్తలు
గాయత్రి పంప్‌హౌస్ నుంచి గోదావరి నదీ జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. భారీ పంపుసెట్లతో ఎత్తిపోతలకు వేదికైన గాయత్రి పంప్ హౌస్ నుంచి మధ్యమానేరు జలాశయంలోకి జలాలలు తరలిస్తున్నారు.
తాజాగా రెండో దిశలో అదే ఎస్సారెస్పీ వరదకాలువ నుంచి పునరుజ్జీవ పథకానికి ఎత్తిపోతల జలాలను మళ్లిస్తున్నారు. దీంతో గాయత్రి పంపుహౌస్ నుంచి ఆరు కిలోమీటర్ల కాలువ ద్వారా వెళ్లే జలాలు శ్రీరాములపల్లి జంక్షన్ వద్ద రెండు పాయలుగా ప్రవహిస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 6.5 టీఎంసీల జలాల ఎత్తిపోతలు చేపట్టారు. దిగువభాగంలో మధ్యమానేరు జలాశయం వైపు సుమారు ఆరువేల క్యూసెక్కులు, ఎగువకు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి సుమారు 3 వేల క్యూసెక్కుల జలాల తరలింపునకు ఏర్పాట్లు చేశారు.
ఇవీ చూడండి:పరవళ్లు తొక్కుతున్న కాళేశ్వరం గంగమ్మ ..!